RBI Regulations: బ్యాంకు దివాళా తీస్తే ఖాతాదారుల డబ్బు పరిస్థితి ఏంటి.. ఆర్బీఐ నిబంధనలు తెలుసా..?

RBI Regulations: కొన్నిసార్లు ఆర్థిక మాంద్యం కారణంగా లేదా ఏదైన ఇతర కారణాల వల్ల బ్యాంకులు దివాళాతీసే పరిస్థితి ఎదురవుతుంది.

Update: 2023-10-20 06:56 GMT

RBI Regulations: బ్యాంకు దివాళా తీస్తే ఖాతాదారుల డబ్బు పరిస్థితి ఏంటి.. ఆర్బీఐ నిబంధనలు తెలుసా..?

RBI Regulations: కొన్నిసార్లు ఆర్థిక మాంద్యం కారణంగా లేదా ఏదైన ఇతర కారణాల వల్ల బ్యాంకులు దివాళాతీసే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో ఆ బ్యాంకు ఖాతాదారులు డబ్బులు కోల్పోవాల్సిందేనా అంటే ఆర్బీఐ కొన్ని నిబంధనలు సూచించింది. కొన్ని రోజుల క్రితం అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) దివాలా తీయడంతో బ్యాంకుల్లో డిపాజిట్ల విషయంలో ప్రజల ఆందోళనలు పెరిగాయి. భారతదేశంలో కూడా బ్యాంకులు దివాళతీస్తాయని చాలా మంది ప్రజలు భయపడ్డారు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగితే మీ డబ్బు పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.. డిపాజిట్ చేసిన మొత్తం మీకు లభిస్తుందా లేదా కొంత మొత్తం లభిస్తుందా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బ్యాంకు కుప్పకూలితే ఎంత డబ్బు తిరిగి వస్తుంది?

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొదలైన అన్ని బ్యాంకుల్లో ఒక్కో వ్యక్తికి రూ.5 లక్షల వరకు బ్యాంకు డిపాజిట్లు రక్షణ ఇస్తున్నాయి. అనుకోని సంక్షోభం ఏదైనా ఏర్పడితే ఖాతాదారుడికి రూ. 5 లక్షలు తిరిగి పొందుతారు. భారత ప్రభుత్వం బ్యాంకు డిపాజిట్లకు డిపాజిట్ బీమాను అందిస్తుంది. ఈ బీమా డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్నారు. ఏదైనా బ్యాంకు దివాళతీస్తే DICGC ప్రతి బ్యాంకుకు ఒక్కో డిపాజిటర్‌కు రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది.

ప్రతి బ్యాంకులోని డిపాజిట్లపై డిపాజిట్ బీమా కవరేజీని విడివిడిగా వర్తింపజేస్తారు. కాబట్టి ఒక కస్టమర్ రెండు వేర్వేరు బ్యాంకుల్లో డబ్బును కలిగి ఉంటే రెండు డిపాజిట్లు రూ. 5 లక్షల పరిమితి వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ఒక వ్యక్తి ఒకే బ్యాంకులో రెండు ఖాతాలు కలిగి ఉంటే అందులో మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మొత్తం కవర్ రూ. 5 లక్షలకు మాత్రమే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకు దివాళతీస్తే డిపాజిట్లపై గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు.

Tags:    

Similar News