Recurring Deposit: రికరింగ్‌ డిపాజిట్‌పై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ చెల్లిస్తోంది..!

Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ ఆప్షన్‌తో మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.

Update: 2023-01-07 10:30 GMT

Recurring Deposit: రికరింగ్‌ డిపాజిట్‌పై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ చెల్లిస్తోంది..!

Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ ఆప్షన్‌తో మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఇందులో మంచి వడ్డీ లభిస్తుంది. రికరింగ్‌ డిపాజిట్‌ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఓపెన్‌ చేయవచ్చు. రికరింగ్ డిపాజిట్ ప్లాన్ కింద చిన్న నెలవారీ డిపాజిట్లను ప్రారంభించి మెచ్యూరిటీపై అందమైన మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. రికరింగ్ డిపాజిట్ కోసం వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

చాలా బ్యాంకుల రికరింగ్ డిపాజిట్లు ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు ఉంటాయి. ఈ కాలంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద మెచ్యూరిటీ సమయంలో అసలు, మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. కానీ మీకు రెగ్యులర్ వ్యవధిలో వడ్డీ అవసరం అనుకుంటే రికరింగ్‌ డిపాజిట్ ఉపయోగపడుతుంది. వడ్డీ రేట్లు మీరు ఎంచుకున్న బ్యాంకు, కాలవ్యవధిపై ఆధారపడి ఉంటాయి. ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంక్, పిఎన్‌బిలో ఆర్‌డిపై వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

ఎస్బీఐ 12 నెలల నుంచి 120 నెలల వరకు 6.25 నుంచి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కాగా కనీస నెలవారీ డిపాజిట్ రూ.100. ఈ రేట్లు డిసెంబర్ 12, 2022 నుంచి ప్రారంభమయ్యాయి. ఆరు వరుస వాయిదాలు చెల్లించకపోతే మెచ్యూరిటీకి ముందే ఖాతా క్లోజ్‌ చేస్తారు. ఖాతాదారుకు మిగిలిన బ్యాలెన్స్ చెల్లిస్తారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)

PNB 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు రికరింగ్ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేటును కలిగి ఉంది. ఈ రేట్లు 1 జనవరి 2023 నుంచి వర్తిస్తాయి. చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ను డిపాజిట్ చేసిన ఒక నెల తర్వాత RD మొత్తం చెల్లిస్తారు.

HDFC బ్యాంక్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలవ్యవధికి 4.5 శాతం నుంచి ఏడు శాతం వరకు వడ్డీ రేట్లు కలిగి ఉంది. ఈ రేట్లు 14 డిసెంబర్ 2022 నుంచి వర్తిస్తాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్

ఈ ప్రైవేట్ బ్యాంకులో సాధారణ ప్రజలకు 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు RD పై వడ్డీ రేట్లు 5.75 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటాయి. ఈ రేట్లు జనవరి 4, 2023 నుంచి వర్తిస్తాయి.

Tags:    

Similar News