Savings Accounts: బ్యాంకులలో పొదుపు ఖాతాలు ఎన్ని రకాలు.. అందులో ఏది బెస్ట్‌..!

Savings Accounts: దేశంలో కోట్లాది మంది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తున్నారు. అయితే బ్యాంకులో ఎన్ని రకాల సేవింగ్స్ ఖాతాలు ఉంటాయో ఎవరికి తెలియదు.

Update: 2022-05-24 12:00 GMT

Savings Accounts: బ్యాంకులలో పొదుపు ఖాతాలు ఎన్ని రకాలు.. అందులో ఏది బెస్ట్‌..!

Savings Accounts: దేశంలో కోట్లాది మంది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను ఉపయోగిస్తున్నారు. అయితే బ్యాంకులో ఎన్ని రకాల సేవింగ్స్ ఖాతాలు ఉంటాయో ఎవరికి తెలియదు. మీకు ఏ పొదుపు ఖాతా ఉత్తమమని ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి పొదుపు ఖాతాలు అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉద్యోగస్తుల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం వివిధ రకాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. మొత్తం 6 రకాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా

రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఖాతాలు నిర్దిష్ట నిబంధనలు, షరతులపై ఓపెన్‌ అవుతాయి. ఈ రకమైన ఖాతాలో ఎటువంటి స్థిరమైన మొత్తానికి డిపాజిట్ ఉండదు. ఇది సురక్షితమైన ఇల్లు వలె ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు మీ డబ్బును మాత్రమే ఉంచుకోవచ్చు. ఇందులో మినిమమ్ బ్యాలెన్స్ అనే షరతు ఒకటి ఉంటుంది.

2. జీతం పొదుపు ఖాతా

ఇలాంటి ఖాతాలను బ్యాంకులు ఉద్యోగుల కోసం కంపెనీల తరపున తెరుస్తాయి. ఉద్యోగులకు జీతం చెల్లించేందుకు ఈ ఖాతా ఉపయోగిస్తారు. ఇందులో బ్యాంకులు వడ్డీని అందిస్తాయి. ఈ రకమైన ఖాతాకు కనీస బ్యాలెన్స్ షరతు లేదు. మూడు నెలల పాటు జీతం రాకపోతే అది సాధారణ పొదుపు ఖాతాగా మార్చబడుతుంది.

3. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా

ఈ రకమైన ఖాతా పొదుపు, కరెంట్ ఖాతాల రెండింటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో విత్‌ డ్రా పరిమితి ఉంటుంది. మీరు సగటు పరిమితి కంటే ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేయలేరు. కానీ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే మీరు ఎటువంటి జరిమానా విధించవలసిన అవసరం లేదు.

4. మైనర్స్ సేవింగ్స్ ఖాతా

ఈ ఖాతా ప్రత్యేకంగా పిల్లల కోసం ఓపెన్‌ చేస్తారు. ఇందులో కనీస బ్యాలెన్స్ నిర్ణయించలేదు. ఈ పొదుపు ఖాతా పిల్లల విద్య కోసం వారి బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించారు. ఈ రకమైన బ్యాంక్ ఖాతా చట్టపరమైన సంరక్షకుని పర్యవేక్షణలో మాత్రమే ఓపెన్ చేయవచ్చు. పిల్లలకి 10 సంవత్సరాలు నిండినప్పుడు అతను తన సొంత ఖాతాను నిర్వహించవచ్చు. పిల్లలకి 18 సంవత్సరాలు నిండినప్పుడు అది సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది.

5. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ ఖాతా

ఈ ఖాతా పొదుపు ఖాతా వలె పని చేస్తుంది. అయితే సాధారణ వాటి కంటే సీనియర్ సిటిజన్‌లకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. అందువల్ల సీనియర్ సిటిజన్లు ఈ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ఖాతా సీనియర్ సిటిజన్ల పొదుపు పథకాలకు లింక్ అయి ఉంటుంది. దీని నుంచి పెన్షన్ ఫండ్స్ లేదా రిటైర్మెంట్ ఖాతాల నుంచి నిధులు విత్‌ డ్రా చేసుకోవచ్చు.

6. మహిళల పొదుపు ఖాతాలు

మహిళలను దృష్టిలో ఉంచుకుని వీటిని ప్రత్యేకంగా సిద్దం చేశారు. ఇది అనేక విభిన్న లక్షణాలను కలిగి ఉంటుంది. మహిళలకు రుణాలపై తక్కువ వడ్డీ, డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేయడంపై ఉచిత ఛార్జీలు, వివిధ రకాల కొనుగోళ్లపై రాయితీలు అందిస్తారు.

Tags:    

Similar News