Wedding Season: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. తక్కువ ఇన్వెస్ట్‌తో భారీ ఇన్‌కమ్..!
Wedding Season: ప్రతి సంవత్సరం నవంబర్ నెల రాగానే దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది దీపావళి ముందు నుంచి ముహూర్తాలు బాగున్నాయని పండితులు చెబుతున్నారు.
Wedding Season: ప్రతి సంవత్సరం నవంబర్ నెల రాగానే దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది దీపావళి ముందు నుంచి ముహూర్తాలు బాగున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచించే వారికి లైటింగ్, డెకరేషన్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. పెళ్లి అయినా, పార్టీ అయినా, పండుగలైనా ఇంటి అలంకరణ చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఈ బిజినెస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అడిగే ధర కూడా లభిస్తుంది. ఇందులో పదే పదే ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచే మళ్లీ మళ్లీ సంపాదించవచ్చు.
లక్షలు సంపాదించే అవకాశం
వాస్తవానికి లైటింగ్, డెకరేషన్ పని ఏకధాటిగా ఉండదు. మీరు ఇందులో ప్రావీణ్యం సంపాదిస్తే ఆస్వాదించడం మొదలుపెడుతారు. ఇది చాలా సృజనాత్మకతతో కూడిన బిజినెస్. మీ పనిని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. దీనివల్ల గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. లక్షల రూపాయలు సంపాదించే అవకాశం లభిస్తుంది. పని బాగుంటే బుకింగ్ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. అయితే ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉండాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలాంటి అలంకరణలు, ఉత్పత్తులకు డిమాండ్ ఉందో తెలుసుకోవడం ముఖ్యం.
చాలా డబ్బు ఖర్చవుతుంది
కేవలం రూ.10 వేల పెట్టుబడితో డెకరేషన్ వ్యాపారం ప్రారంభించవచ్చు. కానీ మార్కెట్ రీసెర్చ్ చేసి డిమాండ్ ఉన్న ఉత్పత్తులను రూ.40 నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెట్టి తీసుకొని డీసెంట్ బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఇందులో కొనుగోలు చేసిన ఉత్పత్తులు సులభంగా చెడిపోవు మీరు వాటిని సంవత్సరాల తరబడి ఉపయోగించవచ్చు.
లాభం గురించి మాట్లాడినట్లయితే ఈ బిజినెస్‌లో 40 నుంచి 45 శాతం మార్జిన్ ఉంటుంది. అలంకార పని సాధారణంగా ఒక రాత్రి మాత్రమే జరుగుతుంది. దీనిలో శ్రమ కూడా 2 నుంచి 3 గంటలు మాత్రమే ఉంటుంది. ఒక్క రాత్రి బుకింగ్ కు సులువుగా రూ.5 నుంచి 10 వేలు పొందవచ్చు. ఈ మొత్తంలో సగం ఖర్చులు, నియమించుకున్న వ్యక్తుల జీతాల కోసం వెళితే సులభంగా ప్రతి నెలా రూ. 1 లక్ష లాభాన్ని పొందవచ్చు.