Fixed Deposit Interest: ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే 9.50% వరకు వడ్డీ..!

Fixed Deposit Interest: ఈ రోజుల్లో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచాయి. ఎఫ్డీ అనేది ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక.

Update: 2023-07-07 04:32 GMT

Fixed Deposit Interest: ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే 9.50% వరకు వడ్డీ..!

Fixed Deposit Interest: ఈ రోజుల్లో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచాయి. ఎఫ్డీ అనేది ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. గత కొన్ని రోజులుగా ఎఫ్డీ వడ్డీ రేట్లలో పెరుగుదల కారణంగా పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని బ్యాంకులు చాలా వడ్డీని అందజేస్తుండడంతో ప్రజలు మ్యూచువల్ ఫండ్స్‌ను వదిలిపెట్టి మరీ వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక సీనియర్‌ సిటిజన్లు అధికంగా వీటిలో డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకులు సాధారణంగా ఫిక్సెడ్ డిపాజిట్ పై 6 నుంచి 7 శాతం వడ్డీని అందజేస్తుండగా ఒక బ్యాంకు 9.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టుబడిదార్లకి పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోలిస్తే ఇందులో ఎఫ్డీపై అత్యధిక వడ్డీని అందిస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) రూ.2 కోట్ల కంటే తక్కువ పెట్టుబడితో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను మార్చింది. బ్యాంక్ ప్రకారం బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న FDలపై 4.50% నుంచి 9% వడ్డీ రేటును చెల్లిస్తోంది. అదే సమయంలో 1001 రోజుల ఎఫ్‌డిపై సాధారణ పౌరులకు 9% వడ్డీని ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్‌లకు 9.50% వరకు వడ్డీని ఇస్తున్నట్లు ప్రకటించారు.

బ్యాంక్ ప్రకారం 7 నుంచి 14 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 4.50% వడ్డీ రేటు, 15 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 4.75% వడ్డీ రేటు ఇస్తున్నారు. ఇక 46 నుంచి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.25% వడ్డీ రేటును, 61 నుంచి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.50% వడ్డీ రేటును అందిస్తోంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ కస్టమర్లకు ఎఫ్డీ పెట్టుబడిపై బ్యాంక్ 0.50% అధిక వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై 4.5% నుంచి 9.50% వరకు వడ్డీ రేటు చెల్లిస్తోంది.

Tags:    

Similar News