Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా పతనమైన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2024-12-06 02:28 GMT

Today Gold Rate: బంగారం ధరలు, నిత్యం హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. గత రెండు నెలలుగా భారీగా తగ్గుతూ అందర్నీ అయోమయంలో పడేస్తున్నాయి బంగారం, వెండి ధరలు. బంగారం ధరల్లో ఆటుపోట్లు చూసి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతనెలలో ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకిన పసిడి ధర మళ్లీ తగ్గుముఖం పట్టింది.

ఈ నేపథ్యంలోనే 6 నుంచి 12 నెలల కాలంలో బంగారం ధరలు ఎలా మారవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతున్నాయనేది అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. అయితే గత మూడు రోజులుగా భారీగా తగ్గింది బంగారం ధర. ఈ క్రమంలో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 130 పెరిగింది. దీంతో రూ. 77,900కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కిలోకు ఏకంగా 1200రూపాయలు పెరిగింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కమోడిటి మార్కెట్ బంగారం ఫ్యూచర్స్ 7.20 లేదా 0.27 శాతం పడిపోయి ఔన్స్ 2,699 డాలర్ల స్థాయికి చేరింది.

నేడు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 77,900కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 71,410కు చేరింది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 78, 050కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర పద గ్రాములకు రూ. 71,560కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల తెలుసుకుందాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

కోల్‌కతాలో రూ. 77,900, రూ. 71,410

విజయవాడలో రూ. 77,900, రూ. 71,410

హైదరాబాద్‌లో రూ. 77,900, రూ. 71,410

ఢిల్లీలో రూ. 78, 050, రూ. 71,560

చెన్నైలో రూ. 77,900, రూ. 71,410

వడోదరలో రూ. 77,950, రూ. 71,460

ముంబైలో రూ. 77,900, రూ. 71,410

పూణేలో రూ. 77,900, రూ. 71,410

కేరళలో రూ. 77,900, రూ. 71,410

బెంగళూరులో రూ. 77,900, రూ. 71,410

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 92,100

ముంబైలో రూ. 92,100

హైదరాబాద్‌లో రూ. 101,100

వడోదరలో రూ. 92,100

విజయవాడలో రూ. 101,100

సూరత్‌లో రూ. 92,100

అయోధ్యలో రూ. 92,100

పాట్నాలో రూ. 92,100

చెన్నైలో రూ. 101,100

కోల్‌కతాలో రూ. 92,100

అహ్మదాబాద్‌లో రూ. 92,100

కేరళలో రూ. 101,100

Tags:    

Similar News