Today Gold, Silver Rates: స్థిరంగా పసిడి, పెరిగిన వెండి ధరలు

Today Gold, Silver Rates: స్థిరంగా పసిడి, పెరిగిన వెండి ధరలు

Update: 2021-10-20 02:13 GMT

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా పసిడి ధర రూ.48,330 వద్ద స్థిరంగా ఉంది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా మంగళవారం ధరలో ఎలాంటి మార్పులేకుండా రూ.44,300 కు వద్ద ఉంది. ఇలా పసిడి ధర తటస్థంగా ఉండిపోగా వెండి ధర మాత్రం పెరిగింది. వెండి రేటు బుధవారం 300 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.67,800 కు చేరింది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర నిలకడగా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.01 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1770 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.69 శాతం తగ్గుదలతో 23.71 డాలర్లకు చేరింది.

Tags:    

Similar News