Today Gold, Silver Rates: నిలకడగా పసిడి ధరలు.. భారీగా పెరిగిన వెండి ధర
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం నిలకడగా ఉంది.
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం నిలకడగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పసిడి ధర రూ.47,890 వద్ద ఉంది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా ఉండి రూ.43,900 కు వద్ద ఉంది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర భారీగా పెరిగింది. వెండి రేటు కేజీపై 700 పెరిగి కేజీ వెండి ధర రూ.65,900 కు చేరింది.
దేశీయ మార్కెట్లో పసిడి ధర నిలకడగా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1755 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా తగ్గడంతో ఔన్స్‌కు 0.28 శాతం తగ్గుదలతో 22.64 డాలర్లకు పడిపోయింది.