Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 220 తగ్గింది.
Gold Rate Today : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రెండోరోజు తగ్గాయి. శుక్రవారం తగ్గిన బంగారం ధర శనివారం కూడా తగ్గింది. 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర పై 220 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ. 300 వరకు తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కూడా బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.66,600 ఉండగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,650 నమోదు అయ్యింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో చూస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.66,750 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,800.
కోల్ కతా, ముంబై, బెంగళూరులో. 22క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.66,600 కాగా, 24క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,650.
చెన్నైలో 22 క్యారట్ల పది గ్రాముల పసిడి ధర రూ.66,600 కాగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,650 వద్ద కొనసాగుతుంది.
దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి రూ. 91,700 వద్దకు చేరింది.