Gold Rate Today: మహిళలకు అదిరిపోయే వార్త..భారీగా తగ్గిన బంగారం ధర
Gold price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గి ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైం హై నుంచి భారీగా పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వచ్చాయి. వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఆగస్టు 23వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Today gold price in Hyderabad: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్ను మహిళలకు, పసిడి ప్రియులకు ఈ మధ్య కాలంలో కాస్త ఆందోళనకరంగానే ఉంది. దీంతోబంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు. అయితే గత రెండు రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా భారీగానే తగ్గింది. దేశీయ మార్కెట్లో నేడు బంగారం ధరలు దిగివచ్చాయి.
అమెరికా అన్ ఎంప్లాయిమెంట్ రేటు గణాంకాల విడుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండే ఛాన్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు ఆల్ టైమ్ నుంచి పడిపోయాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.
దీంతో దేశీయంగానూ ధరలు దిగివచ్చాయి. ఆగస్టు 23, 2024 రోజున హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములపై రూ. 300 తగ్గింది. దీంతో తుల ధర రూ. 66,800 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నేడు, రూ. 330 తగ్గడంతో పది గ్రాముల ధర రూ. 72వేల 870కి చేరింది. దేశరాజధాణిలో 22క్యారెట్లకు 300, 24క్యారెట్ల కు రూ. 380 మేర తగ్గింది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 92 వేలు ఉంది. ఢిల్లీలో రూ. 87వేల ఉంది.