Small Savings: చిన్న పొదుపుతో పెద్ద నిధులు.. పోస్టాఫీసు ఉత్తమ పథకాలు ఇవే..!
Small Savings: దేశంలో నానాటికీ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది.
Small Savings: దేశంలో నానాటికీ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడం అవసరం. ముఖ్యంగా మధ్యతరగతి వారు చిన్న పొదుపు పథకాల కోసం వెతుకుతారు. ఇలాంటి వారికి పోస్టాఫీసు పథకాలు బాగా ఉపయోగపడుతాయి. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ఫండ్‌ని క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు తక్కువ మొత్తంలో అంటే ప్రతి నెలా రూ.500తో ప్రారంభించవచ్చు. అలాంటి పథకాల గురించి తెలుసుకుందాం.
పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలపై ఉన్న వడ్డీ రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర మొదలైన పథకాలు ఉత్తమమైనవిగా చెప్పవచ్చు. మీరు ఈ పథకాలలో పొదుపు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.
పీపీఎఫ్ పథకం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకంల మీరు రూ.500తో ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలో ప్రతి నెలా 500 రూపాయలు పొదుపు చేస్తే భవిష్యత్తులో మీరు పెద్ద ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ఈ పథకంలో వార్షిక వడ్డీ 7.1 శాతం నుంచి 7.6 శాతం వరకు ఉంటుంది. మీరు సంవత్సరానికి గరిష్టంగా రూ.150000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన
మీరు సుకన్య సమృద్ధి ఖాతా పథకంలో రూ.500తో ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాలో ప్రతి నెలా 500 రూపాయలు పొదుపు చేస్తే భవిష్యత్తులో పెద్ద ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ఈ పథకంలో వార్షిక వడ్డీ 7.1 శాతం నుంచి 7.6 శాతం వరకు ఉంటుంది. ఇందులో సంవత్సరానికి గరిష్టంగా రూ.150000 పెట్టుబడి పెట్టవచ్చు. దీంతోపాటు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతారు.
ఆర్డీ ఖాతా పథకం
మీరు పోస్ట్ ఆఫీస్ RD ఖాతా (పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా) పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 5.8 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు త్రైమాసికానికి అందుబాటులో ఉంటుంది. మీరు ఈ పథకంలో ప్రతి నెలా కనీసం రూ.100 లేదా రూ.10 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్ద ఫండ్‌ను సృష్టించవచ్చు.