Post Office Schemes: ఈ 2 పోస్టాఫీస్‌ స్కీంలు చాలా బెస్ట్‌.. మహిళలు విలువైన రాబడి పొందుతారు..!

Post Office Schemes: చిన్నచిన్న పొదుపులు చేయాలనుకునేవారికి పోస్టాఫీసు పథకాలు బాగా సెట్‌ అవుతాయి. ముఖ్యంగా మహిళల కోసం ఇందులో చాలా సేవింగ్‌ స్కీమ్స్‌ ఉన్నాయి.

Update: 2024-01-31 11:45 GMT

Post Office Schemes: ఈ 2 పోస్టాఫీస్‌ స్కీంలు చాలా బెస్ట్‌.. మహిళలు విలువైన రాబడి పొందుతారు..!

Post Office Schemes: చిన్నచిన్న పొదుపులు చేయాలనుకునేవారికి పోస్టాఫీసు పథకాలు బాగా సెట్‌ అవుతాయి. ముఖ్యంగా మహిళల కోసం ఇందులో చాలా సేవింగ్‌ స్కీమ్స్‌ ఉన్నాయి. 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలకు అనుగుణంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రారంభించారు. రెండేళ్లలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడిని పొందవచ్చు. అలాగే 10 సంవత్సరాల వయస్సు వరకు ఆడపిల్ల పేరుపై సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడిని పొందవచ్చు. ఈ రెండు పథకాలు మహిళల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.

ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్

ఏ వయస్సులోనైనా మహిళలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలు. ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం వల్ల 7.50 శాతం స్థిర వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద డిపాజిట్ చేసిన మొత్తంపై రూ.1.50 లక్షల రాయితీ లభిస్తుంది. డిసెంబర్ 2023లో ఈ పథకం కింద రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే మీరు మెచ్యూరిటీపై రూ. 2,32,044 లక్షలు పొందుతారు.

సుకన్య సమృద్ధి యోజన

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014లో సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించింది. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించారు. ఈ పథకం కింద 10 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయి పేరుపై ఖాతాను తెరవవచ్చు. సంవత్సరానికి రూ. 250 నుంచి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి భారీ రాబడిని పొందవచ్చు. ఈ పథకం కింద 18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల వయస్సులో మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల కుమార్తె చదువు, పెళ్లి ఖర్చుల టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది.

MSSC vs SSY

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు రెండూ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించారు. అయితే MSSC అనేది స్వల్పకాలిక పొదుపు పథకం. SSY అనేది దీర్ఘకాలిక పొదుపు పథకం. సుకన్య ఖాతాలో పెట్టుబడి పెట్టడం వల్ల కుమార్తె చదువు, పెళ్లి ఖర్చుల టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు. స్వల్పకాలంలో అధిక రాబడిని పొందడానికి MSSC ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు.

Tags:    

Similar News