Tax Free Income: ఈ 7 రకాల ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. అవేంటంటే..?

Tax Free Income: ప్రజలు సంపాదించే ఆదాయంపై కచ్చితంగా పన్ను చెల్లించాలి.

Update: 2023-01-15 15:00 GMT

Tax Free Income: ఈ 7 రకాల ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. అవేంటంటే..?

Tax Free Income: ఇందులో జీతంతో పాటు పొదుపు ద్వారా వచ్చే వడ్డీ, ఇంటి నుంచి సంపాదన, సైడ్ బిజినెస్, క్యాపిటల్ గెయిన్స్ వంటి అనేక అంశాలు ఉంటాయి. కానీ ఆదాయం పన్ను పరిధిలోకి రాని కొన్ని వనరులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 పన్ను మినహాయింపు ఆదాయం గురించి ప్రస్తావించింది. మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని నిర్దిష్ట ఆదాయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఈపీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తం:

పీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మీ ఈపీఎఫ్‌ ఖాతాలో యజమాని డిపాజిట్ చేసిన మొత్తంపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులోని షరతు ఏంటంటే ఈ మొత్తం మీ బేసిక్ శాలరీలో 12% మించకూడదు. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే దానిపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వివాహ బహుమతులు:

వివాహంలో స్నేహితులు లేదా బంధువుల నుంచి బహుమతి పొందినట్లయితే దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వివాహం జరిగి ఆరు నెలలు దాటితే దానిపై పన్ను మినహాయింపు ఉండదు. అలాగే బహుమతి విలువ రూ.50,000 మించకూడదు.

పొదుపు ఖాతాపై వడ్డీ:

మీరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి సంవత్సరానికి రూ. 10,000 వరకు వడ్డీని పొందినట్లయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. పొదుపు ఖాతాపై వార్షిక వడ్డీ రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే అదనపు మొత్తంపై ఆదాయపు పన్ను చెల్లించాలి.

భాగస్వామ్య సంస్థ నుంచి లాభం:

మీరు ఒక సంస్థలో భాగస్వామి అయితే మీ వాటాగా లాభం వచ్చినట్లయితే దానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే మీ భాగస్వామ్య సంస్థ ఇప్పటికే దానిపై పన్ను చెల్లిస్తుంది. ఆదాయపు పన్ను మినహాయింపు సంస్థ లాభాలపై మాత్రమే ఉంటుంది. మీరు పొందే జీతంపై కాదని గుర్తుంచుకోండి.

జీవిత బీమా క్లెయిమ్:

మీరు జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసినట్లయితే దానిని క్లెయిమ్ చేస్తున్నప్పుడు లేదా మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తం ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా ఉచితం. షరతు ఏంటంటే మీ పాలసీ వార్షిక ప్రీమియం దాని హామీ మొత్తంలో 10% మించకూడదు.

VRSలో స్వీకరించిన మొత్తం:

చాలా మంది ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకుంటారు. మీరు VRS తీసుకున్నట్లయితే రూ. 5 లక్షల వరకు అందుకున్న మొత్తం ఆదాయపు పన్ను నుంచి ఉచితం. ఈ సదుపాయం ప్రభుత్వ లేదా PSU (పబ్లిక్ సెక్టార్ కంపెనీలు)లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులకు వర్తించదు.

వ్యవసాయ ఆదాయం:

వ్యవసాయం లేదా సంబంధిత కార్యకలాపాల ద్వారా వచ్చే సంపాదనపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ ఆదాయంలో దాని నుంచి వచ్చే దిగుబడి, కౌలు రూపంలో పొందిన మొత్తం మొదలైనవి కూడా ఉంటాయి.

Tags:    

Similar News