Post Office: పోస్టాఫీసు బెస్ట్‌ స్కీమ్‌.. తక్కువ పెట్టుబడితో 35 లక్షల ఫండ్‌..!

Post Office: పోస్టాఫీసు బెస్ట్‌ స్కీమ్‌.. తక్కువ పెట్టుబడితో 35 లక్షల ఫండ్‌..!

Update: 2022-06-11 12:39 GMT

Post Office: పోస్టాఫీసు బెస్ట్‌ స్కీమ్‌.. తక్కువ పెట్టుబడితో 35 లక్షల ఫండ్‌..!

Post Office: మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్‌ ఉండకూడదంటే మీకు పోస్టాఫీసు బెస్ట్‌ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు. పైగా పోస్టాఫీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. మీరు తక్కువ పెట్టుబడితో మంచి రాబడిని పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఈ స్కీమ్‌లో చిన్న పెట్టుబడిపై సుమారు రూ. 35 లక్షల ఫండ్ క్రియేట్‌ చేయవచ్చు.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీ వయస్సు 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలోని మెచ్యూరిటీ మొత్తాన్ని పెట్టుబడిదారుడు గరిష్టంగా 80 సంవత్సరాల వయస్సులో పొందవచ్చు. ఒకవేళ మెచ్యూరిటీకి ముందు సదరు వ్యక్తి మరణిస్తే ఈ డబ్బు మొత్తం నామినీకి ఇస్తారు. ఈ పథకంలో పెట్టుబడిదారుడు కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో పాటు మీరు ప్రతి నెల, మూడు నెలలు, 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు. ఒక వ్యక్తి ప్రీమియం మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయితే 1 నెల పొడిగిస్తారు.

మీరు 19 సంవత్సరాల వయస్సులో పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష పథకంలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు 55 సంవత్సరాల వయస్సు వరకు నెలవారీ ప్రీమియంగా రూ. 1,515, అలాగే 58 సంవత్సరాల వయస్సులో రూ. 1,463, ఇక 60 ఏళ్ల వరకు రూ. 1,411 చెల్లించాలి. ఈ పెట్టుబడిపై మీరు 55 ఏళ్ల వయస్సులో రూ. 31.60 లక్షలు, 58 ఏళ్లకు రూ. 33.40 లక్షలు, 60 ఏళ్లకు రూ. 35 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందుతారు.

Tags:    

Similar News