Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు
Equity Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు
Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ దేశీ సూచీలు తాజా వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలు ఎన్‌ఎస్‌డీఎల్ స్తంభింపజేసిందన్న వార్తలు స్టాక్ మార్కెట్ ను కుదిపేశాయి. ఫలితంగా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలాయి..గతవారం సూచీలు రికార్డు స్థాయిలో గరిష్ఠాలను నమోదు చేసిన నేపధ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీలపై ప్రభావం చూపినట్లయింది..అయితే మార్కెట్ ముగిసే సమయానికి కాస్త ముందుగా దిగ్గజ కంపెనీల షేర్ల అండతో సూచీలు లాభాల బాట పట్టాయి..చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76 పాయింట్ల మేర ఎగసి 52,551 వద్దకు చేరగా నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప లాభంతో 15,811 వద్ద స్ధిరపడ్డాయి.