Busines Idea: కేవలం రూ.10,000లతో వ్యాపారం ప్రారంభించండి.. లక్షలు సంపాదించండి..!
Busines Idea: ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే వ్యాపారమే బెస్ట్ అని చెప్పవచ్చు.
Busines Idea: ఈ రోజుల్లో ఉద్యోగాల కంటే వ్యాపారమే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యోగం చేస్తే పరిమిత సంపాదన మాత్రమే ఉంటుంది కానీ బిజినెస్ అనేది చిన్నదైనా పర్వాలేదు రోజు రోజుకి సంపాదన పెరుగుతుంది. అయితే ఏ వ్యాపారం ప్రారంభించడానికైనా కొంత పెట్టుబడి అవసరమవుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే బిజినెస్‌లు కూడా ఉంటాయి. కేవలం రూ.10,000లతో ప్రారంభించే ఒక బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.
తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే ప్రారంభించే క్యాటరింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. నేటి రోజుల్లో పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రతిచోటా ఫంక్షన్లకు రుచికరమైన భోజనాలను క్యాటరింగ్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఈ వ్యాపారం చేయడం ద్వారా లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. అయితే రుచికరమైన ఆహారాలను వండటం, వడ్డించటం చాలా ముఖ్యం. ఇందుకోసం నైపుణ్యం ఉండే వంట మనుషులని సిద్దం చేసుకోవాలి. అలాగే క్యాటరింగ్ చేయడానికి కొంతమంది బాయ్స్‌కూడా ఉండాలి.
పెళ్లిళ్ల సీజన్‌లో ఈ బిజినెస్‌కి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి కాబట్టి నెలకు కనీసం రూ.లక్షకు పైగా సంపాదించవచ్చు. మిగిలిన సమయాల్లో తక్కువగా ఉన్నప్పటికీ నెలకి రూ.30 నుంచి రూ.45 వేల వరకు సంపాదించవచ్చు. మీరు నివసిస్తున్న ఇంటి నుంచే ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎలాంటి ప్రత్యేకమైన షాపు, అద్దెకి ఇల్లు లాంటిది ఉండదు. కాకపోతే దీనికోసం వంటసామానం, పనివారు, శుభ్రమైన వంట ప్రదేశం ఉంటే సరిపోతుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే కొంత కష్టంతో కూడుకున్న పనే కానీ సరైన ఆలోచనతో ముందుకు సాగితే మంచి ఆదాయం సంపాదించవచ్చు.