ఎల్‌ఐసీ ఖాతాదారులకి షాక్‌.. ఇక పాలసీపై ఈ ప్రయోజనం ఉండదు..!

LIC Policy: దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ పాలసీలపై భారీ పన్ను ప్రయోజనాన్ని అందించేది.

Update: 2023-02-15 14:30 GMT
Shock for LIC Policy Holders No More Tax Exemption on Policy

ఎల్‌ఐసీ ఖాతాదారులకి షాక్‌.. ఇక పాలసీపై ఈ ప్రయోజనం ఉండదు..!

  • whatsapp icon

LIC Policy: దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ పాలసీలపై భారీ పన్ను ప్రయోజనాన్ని అందించేది. అయితే ఈసారి నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ప్రజలు ఇప్పుడు ఎల్‌ఐసి పాలసీలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పన్ను మినహాయింపు కారణంగా బీమా కంపెనీలు చాలా బలమైన స్థితిలో ఉన్నాయి. కస్టమర్లు కూడా ఎక్కువగా పన్ను ఆదా కోసం మాత్రమే ఎల్‌ఐసీ పాలసీని తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఎల్‌ఐసి చైర్మన్ కంపెనీ మొత్తం వార్షిక ప్రీమియంలో సగం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తుందని చెప్పారు. ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రజలు బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. ఎందుకంటే పన్నును ఆదా చేసుకోవడానికి బీమా పాలసీలలో డబ్బును పెట్టుబడి పెడతారు. 2023 బడ్జెట్‌లో రూ.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో పాలసీ మెచ్యూరిటీపై పన్ను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. దీనివల్ల పన్ను ఆదా కోసం ఎల్‌ఐసీ పాలసీని తీసుకునే వారు భవిష్యత్తులో తీసుకోకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో బీమా కంపెనీలపై ప్రభావం చూపనుంది. దీని ప్రత్యక్ష ప్రభావం ఎల్‌ఐసీ వృద్ధిపై కనిపిస్తుంది. దీనిపై ఎల్‌ఐసీ ఛైర్మన్ మాట్లాడుతూ రూ.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం ఉన్న పాలసీలు కేవలం 1% కంటే తక్కువ ఉన్నాయి. దీనివల్ల సంస్థపై తక్కువ ప్రభావ ఉంటుందని తెలిపారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎల్‌ఐసి పాలసీలను కలిగి ఉంటే వారి మొత్తం ప్రీమియం కలిపి 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే కస్టమర్ దీనిపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు.

Tags:    

Similar News