Winter Business: చలికాలంలో సూపర్‌ బిజినెస్‌.. తక్కువ సమయంలో మంచి లాభాలు పొందొచ్చు..!

Winter Business: చలికాలంలో చేసే చాలా బిజినెస్‌లు ఉన్నాయి. ఇవి కేవలం ఈ సీజన్‌ వరకే చేయవచ్చు. అయినప్పటికీ తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి లాభాలు సంపాదించవచ్చు.

Update: 2023-11-17 15:00 GMT

Winter Business: చలికాలంలో సూపర్‌ బిజినెస్‌.. తక్కువ సమయంలో మంచి లాభాలు పొందొచ్చు..!

Winter Business: చలికాలంలో చేసే చాలా బిజినెస్‌లు ఉన్నాయి. ఇవి కేవలం ఈ సీజన్‌ వరకే చేయవచ్చు. అయినప్పటికీ తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి లాభాలు సంపాదించవచ్చు. సీజనల్‌ బిజినెస్‌లు చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ ఆర్జించవచ్చు. ఒకవేళ నష్టం వచ్చినా అది మన ఆర్థిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం చూపకుండా ఉంటుంది. ఇందులో భాగంగా శీతాకాలంలో చేసే ఒక బిజినెస్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

దీపావళి పండుగ నుంచి చలి విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్కీన్స్‌కు, ఉలెన్‌ దుస్తువులకు మార్కెట్లో డిమాండ్‌ పెరుగుతోంది. చలి నుంచి తట్టుకునేందుకు ప్రజలు స్వెటర్స్‌, జాకెట్స్‌, రగ్గులు, దుప్పట్లను కొనుగోలు చేస్తున్నారు. చలికాలంలో ఈ బిజినెస్‌కు బాగా డిమాండ్‌ ఉంటుంది. ఈ సీజన్‌ను క్యాష్‌ చేసుకొని బాగా లాభాలు సంపాదించవచ్చు.కేవలం 2 నుంచి 3 నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. అయితే ఈ వ్యాపారం రిటైల్‌గా కాకుండా హోల్‌సేల్‌గా చేయాలి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు.

భారీ ఎత్తున దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు హోల్‌సేల్‌లో అమ్మితే మంచి లాభాలను పొందొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న ఉన్ని దుస్తువులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. దీనివల్ల అన్ని వయసుల వారిని ఆకట్టుకోవచ్చు. ఈ రోజుల్లో ఈ కామర్స్‌ సైట్స్‌ కూడా వస్తువులను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తోంది. మీరు సిటీలో ఉంటే ఆన్‌లైన్‌లో వింటర్‌ దుస్తులను విక్రయించవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 2 నుంచి రూ. 3 లక్షలు ఉంటే సరిపోతుంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు దుస్తులు ఆర్డర్‌ చేసుకోవచ్చు.

Tags:    

Similar News