Pension Scheme: నెలకి రూ.210 సేవింగ్స్‌తో ఏడాదికి రూ.60000 పెన్షన్..!

Pension Scheme: చాలామంది వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదిస్తారు కానీ పొదుపు చేయలేరు. దీనివల్ల వృద్ధాప్యంలో బాగా ఇబ్బందిపడుతారు.

Update: 2024-02-20 11:30 GMT

Pension Scheme: నెలకి రూ.210 సేవింగ్స్‌తో ఏడాదికి రూ.60000 పెన్షన్..!

Pension Scheme: చాలామంది వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదిస్తారు కానీ పొదుపు చేయలేరు. దీనివల్ల వృద్ధాప్యంలో బాగా ఇబ్బందిపడుతారు. పిల్లలపై లేదంటే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. చాలామందికి ఈ వయసులో ఆదాయం లేక అప్పులు చేయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందుకే సంపాదించే వయసులో ఉన్నప్పుడే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది.

సంపాదించిన మొత్తం పొదుపు చేయడం కష్టమైన పని కానీ అందులో కొంత పొదుపు చేసుకోవచ్చు. ఇందుకు పెన్షన్‌ స్కీమ్‌లు బెస్ట్‌. ఎందుకుంటే ఇందులో పొదుపు చేయడం వల్ల అరవై ఏళ్ల తర్వాత ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. నెల నెలకి పెన్షన్‌ రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శేష జీవితం హాయిగా గడిచిపోతుంది. అలాంటి ప్రభుత్వ స్కీమ్‌ ఒకటి ఉంది. దాని పేరే అటల్‌ పెన్షన్‌ యోజన. ఇందులో18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు చేరేందుకు అవకాశం ఉంది.

రోజుకు కేవలం రూ. 7 ఆదా చేయడం ద్వారా మీరు నెలకు రూ.5 వేల పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే రోజుకు రూ.7 మాత్రమే చెల్లించాలి. అంటే నెలకు రూ.210 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లింపు కొనసాగించాలి. అయితే వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది. మీరు సమీపంలోని బ్యాంకుకో వెళ్లి ప్రధాన మంత్రి అటల పెన్షన్ యోజన పథకంలో చేరొచ్చు.

19 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.228 చెల్లించాలి. 20 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.248, 21 ఏళ్లుంటే రూ.269, 22 ఏళ్ల వయస్సుంటే నెలకు రూ.292, 23 ఏళ్ల అయితే నెలకు రూ.318, 24 ఏళ్లు అయితే నెలకు రూ.346, 25 ఏళ్లకు నెలకు రూ.376, 26 ఏళ్లకు నెలకు రూ.409, 27 ఏళ్లకు నెలకు రూ.446, 28ఏళ్లకు నెలకు రూ.485, 29 ఏళ్లకు నెలకు రూ.529 చెల్లించాలి. 30 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.577 చెల్లించాలి. 31 సంవత్సరాలకు నెలకు రూ.630, 32 సంవత్సరాలకు నెలకు రూ.689 చెల్లించాలి. 40 ఏళ్లు ఉంటే నెలకు రూ.1454 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News