Stocks: రూ.1లక్ష పెట్టుబడితో.. రూ.4 కోట్ల లాభం.. కళ్లు చెదిరే లాభాలిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏంటంటే?

Remedium Lifecare: స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇవి తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇచ్చాయి.

Update: 2023-07-20 09:00 GMT

Stocks: రూ.1లక్ష పెట్టుబడితో.. రూ.4 కోట్ల లాభం.. కళ్లు చెదిరే లాభాలిచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏంటంటే?

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీల షేర్లు ఉన్నాయి. ఇవి తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇచ్చాయి. అదే సమయంలో, కొన్ని షేర్లతో పెట్టుబడిదారులు ధనవంతులుగా మారారు. ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ రాబడిని ఇచ్చాయి. దీనితో పాటు, గత 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు బంపర్ డబ్బును అందించిన ఒక స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రెమిడియం లైఫ్‌కేర్ స్టాక్ గత కొన్ని సంవత్సరాలలో దాని పెట్టుబడిదారులకు చాలా రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.12 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 25 మే 2018న షేర్ ధర రూ. 12.60లుగా నిలిచింది. అయితే, దీని తర్వాత షేరు ధరలో క్రమంగా పెరుగుదల కనిపించింది.

నిరంతర పెరుగుతూనే..

2021 సంవత్సరంలో, స్టాక్ మొదటిసారిగా రూ. 100 దాటింది. ఈ కంపెనీ స్టాక్‌లో బంపర్ బూమ్ 2023లో కనిపించింది. 2023 సంవత్సరం ప్రారంభంలో, రెమిడియం లైఫ్‌కేర్ షేర్ ధర దాదాపు రూ.140లకు చేరకుంది. ఆ తర్వాత స్టాక్ రాకెట్ లాగా మారింది. 2023 సంవత్సరం ప్రారంభం నుంచి స్థిరమైన పెరుగుదలను చూపుతోంది.

రూ.4000 దాటుతోంది..

ప్రస్తుతం రెమిడియం లైఫ్‌కేర్ షేర్ ధర కూడా రూ.4000 దాటింది. ఈ స్టాక్ ఆల్ టైమ్ హై, 52 వారాలకు రూ. 4547.80లు. దీని 52 వారాల కనిష్ట ధర రూ. 136.15లుగా ఉంది. కాగా గత ఐదేళ్లలో ఈ స్టాక్ 31981 శాతం వృద్ధిని కనబరిచింది. అదే సమయంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి జులై 20 వరకు, షేరు ధరలో దాదాపు 2800 శాతం పెరుగుదల ఉంది.

ఇన్వెస్టర్లకు బంఫర్ లాభాలు..

ఒక పెట్టుబడిదారుడు ఐదేళ్ల క్రితం 13 రూపాయల ధరతో ఈ కంపెనీకి చెందిన 1 లక్ష షేర్లను కొనుగోలు చేసినట్లయితే, అతను 13 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం ఆ లక్ష షేర్ల విలువను రూ.4000 ప్రకారం అంచనా వేస్తే.. వాటి విలువ రూ.40 కోట్లు ఉండేది. ఇటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారుడు కేవలం 13 లక్షల పెట్టుబడితో ధనవంతుడు అయ్యాడు.

(గమనిక: ఇక్కడ స్టాక్ పనితీరు మాత్రమే అందించాం. ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి.)

Tags:    

Similar News