Post Office Recurring Deposit Scheme: పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. నెలకు రూ. వెయ్యి పొదుపు చేస్తే చాలు..!
Post Office Recurring Deposit Scheme: పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ పథకాల్లో ఆర్డీ(రికరింగ్ డిపాజిట్) ఒకటి.
Post Office Recurring Deposit Scheme: సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా ఎంత పొదుపు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు రిటర్న్స్ కావాలని ఆశించడం సర్వసాధారణం. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పలు పథకాలను తీసుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోస్టాఫీస్ పథకాల గురించి.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్ కూడా పొందొచ్చు. ఇలా పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ పథకాల్లో ఆర్డీ(రికరింగ్ డిపాజిట్) ఒకటి. ఈ పథకాన్ని పలు బ్యాంకులతో పాటు పోస్టాఫీస్‌లో కూడా అందిస్తున్నారు. ఈ పథకంలో నెలవారీగా కొంత మొత్తంలో పెట్టుబడి పెడుతూ పోతుంటే మంచి రిటర్న్స్ వస్తాయి.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.7 శాతం మేర వడ్డీ అందిస్తోంది కేంద్రం. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లుగా ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ. 100 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పథకంలో నెలకు రూ. 1000 చొప్పున జమ చేస్తుంటే ఎంత ఆదాయం పొందుతారో తెలుసుకోవచ్చు.
మీరు నెలకు రూ. 1000 చొప్పున సేవ్ చేస్తూ వెళ్తే ఐదేళ్ల తర్వాత వడ్డీతో పాటు రూ.71 వేలు అవుతాయి. అంటే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ.71 వేలు అందుతాయి. అలాగే మీరు ఈ స్కీమ్‌ను మరో 5 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయలు జమ చేస్తూ వెళ్తే పదేళ్ల తర్వాత మీరు జమ చేసే సొమ్ము రూ.1.20 లక్షలు అవుతుంది. దానిపై వడ్డీ దాదాపు రూ. 50 వేల వరకు వస్తుంది. అంటే మీ చేతికి మొత్తంగా రూ.1.70 లక్షల వరకు వస్తాయి.