Post Office: ప్రతి నెలా సంపాదన కోసం ఈ పథకం బెస్ట్.. ఇంకా మీ డబ్బు సురక్షితం..!
Post Office: మీరు ప్రతినెలా ఆదాయం సంపాదించాలంటే పోస్టాఫీసు అందించే ఈ పథకం బెస్ట్ అని చెప్పవచ్చు.
Post Office: మీరు ప్రతినెలా ఆదాయం సంపాదించాలంటే పోస్టాఫీసు అందించే ఈ పథకం బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (MIS).ఇందులో వడ్డీ రేటు బాగుంటుంది. ఇంకా మీ డబ్బు కూడా సురక్షితం. ప్రస్తుతం నెలవారీ ఆదాయ పథకంలో 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది. ఈ చిన్న పొదుపు పథకంలో నెలవారీగా వడ్డీ చెల్లిస్తారు. అంటే ప్రతి నెలా డబ్బు వస్తుంది.
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో రూ. 1000 గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఒకే ఖాతాలో రూ.4.5 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో ఒక వ్యక్తి వాటాను లెక్కించేటప్పుడు ప్రతి జాయింట్ హోల్డర్‌కు సమాన వాటా ఉంటుందని గమనించండి. ఈ పోస్టాఫీసు పథకంలో ఒక వయోజన లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. దీంతో పాటు మైనర్ల తరపున కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వ్యవధి ముగిసిన తర్వాత క్లోజ్ అవుతుంది. దీని కోసం వ్యక్తి పాస్‌బుక్‌తో పాటు తగిన దరఖాస్తు ఫారమ్‌ను సంబంధిత పోస్టాఫీసుకు సమర్పించాలి. ఖాతాదారు మెచ్యూరిటీకి ముందే మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు. మొత్తం అతని నామినీకి లేదా చట్టబద్ధమైన వారసుడికి చెల్లిస్తారు. వాపసు చేసిన నెలకు ముందు నెలకు వడ్డీ లభిస్తుంది.