Post Office: పోస్టాఫీసు సూపర్ స్కీం.. రోజుకి రూ.50 పొదుపు చేస్తే 35 లక్షలు మీవే..!

Post Office: పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని కోరుకుంటారు.

Update: 2022-07-19 08:30 GMT

Post Office: పోస్టాఫీసు సూపర్ స్కీం.. రోజుకి రూ.50 పొదుపు చేస్తే 35 లక్షలు మీవే..!

Post Office: పెట్టుబడిదారులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని కోరుకుంటారు. కానీ వారి డబ్బుకి భద్రత ఉంటుందా లేదా అని గమనించరు. దీంతో చాలాసార్లు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కానీ పోస్టాఫీసు స్కీములలో పెట్టిన పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. సామాన్య చిన్న తరగతి ప్రజలకి పోస్టాఫీసు పథకాలు అనువుగా ఉంటాయి. అందులో ఒకటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయిన గ్రామ సురక్ష యోజన. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకంలో మీరు ప్రతి నెలా 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే రోజు రూ.50 పొదుపు చేస్తే చాలు. ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం ద్వారా మీరు రాబోయే కాలంలో 31 నుంచి 35 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. అప్పుడు అతని నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాల వరకి రూ. 1515 చెల్లించాలి. అలాగే 58 సంవత్సరాలకు రూ. 1463, 60 సంవత్సరాలకు రూ. 1411 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత పాలసీ కొనుగోలుదారు 55 సంవత్సరాలకు రూ. 31.60 లక్షలు, 58 సంవత్సరాలకు రూ. 33.40 లక్షలు, 60 సంవత్సరాలకు రూ. 34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందుతారు.

ఈ స్కీంలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద కనీస హామీ మొత్తం రూ. 10,000 నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రీమియం చెల్లింపు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా చేయవచ్చు. ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. అంతేకాదు మీరు ఈ పథకంపై రుణం కూడా తీసుకోవచ్చు. ఈ పథకాన్ని తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత నచ్చకపోతే సరెండర్ కూడా చేయవచ్చు.

Tags:    

Similar News