Saving scheme: మీ డబ్బులు డబుల్ కావాలా.? పోస్టాఫీస్‌ బెస్ట్‌ స్కీమ్‌..

Saving scheme: మీ డబ్బులు డబుల్ కావాలా.? పోస్టాఫీస్‌ బెస్ట్‌ స్కీమ్‌..

Update: 2024-06-28 01:30 GMT

Saving scheme: మీ డబ్బులు డబుల్ కావాలా.? పోస్టాఫీస్‌ బెస్ట్‌ స్కీమ్‌.. 

Saving scheme: కష్టపడి సంపాదించే డబ్బులను సరిగ్గా సేవింగ్ చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ రావాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. అయితే పెట్టిన పెట్టుబడికి భద్రతతో పాటు మంచి రిటర్న్స్ కావాలనుకునే వారికి పోస్టాఫీస్‌ అందిస్తున్న పథకాలు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. తక్కువ సమయంలోనే మీ పెట్టుబడి డబుల్ అయ్యేందుకు ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ అందిస్తున్న బెస్ట్ పథకాల్లో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌ ఒకటి. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ లాంటిది. ఇందులో పెట్టుబడిగా పెట్టిన మొత్తం నిర్ణీత సమయం తర్వాత రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో మెచ్యూరిటీ టర్మ.. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, 5 ఏళ్లుగా ఉంటుంది. మీరు ఎంచుకున్న కాల వ్యవధిని బట్టి మీకు వడ్డీ లభిస్తుంది. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం డబుల్‌ కావాలంటే ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదాహరణకు మీరు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే మీకు 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో ఐదేళ్లలో మీకు వడ్డీ రూపంలో రూ. 2,24,974 లభిస్తుంది. దీంతో మీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. ఇదే పథకాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తే.. వడ్డీ రూ. 5,51,175 అవుతుంది. ఇలా పదేళ్ల తర్వాత మీ మొత్తం రూ. 10,51,175 అవుతుంది. అయితే ప్రతీ 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటారు. ఇక ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరూ సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News