పోస్టాఫీసు ఖాతాదారులకి శుభవార్త.. వీటి విషయంలో కొత్త నిబంధనలు..!
Post Office: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) కిసాన్ వికాస్ పత్ర (KVP) ఖాతాలను ఓపెన్ చేయడానికి, మూసివేయడానికి కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
Post Office: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) కిసాన్ వికాస్ పత్ర (KVP) ఖాతాలను ఓపెన్ చేయడానికి, మూసివేయడానికి కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీనివల్ల ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కూర్చొని వీటిని మెయింటెన్ చేయవచ్చు. కొత్త ఖాతాల కోసం అప్లై చేయవచ్చు ఉన్న ఖాతాలని క్లోజ్ చేయవచ్చు. అయితే ఖాతాదారులు కచ్చితంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ నిర్వహించే (DOP) ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ని కలిగి ఉండాలి. ఇది ఉంటే తరచుగా పోస్టాఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
కిసాన్ వికాస్ పత్ర అనేది భారతీయ పోస్టల్ శాఖ చిన్న పొదుపు పథకం. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తం ఖాతా ఓపెన్ చేసిన తేదీ నుంచి తొమ్మిది సంవత్సరాల ఐదు నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ పొదుపు పథకం కింద లబ్ధిదారులకు 6.9 వడ్డీ లభిస్తుంది.
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC)
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ చిన్న పొదుపు పథకాల ద్వారా లభించే ధృవపత్రాలు. వీటిలో డిపాజిట్ చేసిన మొత్తం డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీపై 6.8 శాతం వడ్డీ ఇస్తోంది.
NSC, KVP ఖాతాలు ఎలా తెరవాలి..?
1. ముందుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహాయంతో ఇండియన్ పోస్టల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి. ,
2. తర్వాత సర్వీస్ రిక్వెస్ట్స్ ఆఫ్ జనరల్ సర్వీసెస్ ఆప్షన్‌కి వెళ్లి న్యూ రిక్వెస్ట్‌ల కోసం క్లిక్ చేయండి.
3. ఇప్పుడు NSC, KVP ఖాతా అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేయాలనుకున్న దానిపై క్లిక్ చేయండి.
4. మీరు కనీసం రూ.1000తో NSC ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
5. డెబిట్ ఖాతా లింక్డ్ పోస్టాఫీసు సేవింగ్ ఖాతాను ఎంచుకోండి.
6. నిబంధనలు, షరతులను అంగీకరించి క్లిక్ చేయండి.
7. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించండి అనే ఎంపికపై క్లిక్ చేయండి.
8. ఇప్పుడు లావాదేవీ చేయండి. పాస్‌వర్డ్ క్రియేట్ చేయండి.
9. చివరలో కనిపించే వివరాల సహాయంతో మళ్లీ లాగిన్ అవడం ద్వారా NSC ఖాతా స్టేటస్ చెక్ చేయండి.