PM Kisan: లబ్ధిదారు మరణించినప్పుడు ఈ నియమాలు పాటించండి..!

PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.

Update: 2022-10-09 08:30 GMT

PM Kisan: లబ్ధిదారు మరణించినప్పుడు ఈ నియమాలు పాటించండి..!

PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. త్వరలో ప్రధాని మోడీ 12వ విడత డబ్బులు విడుదల చేయనున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి. కానీ ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు తెలియని అనేక నియమాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ప్రతి సంవత్సరం 3 వాయిదాలలో 2000 రూపాయలు చొప్పున 6000 రూపాయలు అందిస్తుంది. ఇందుకోసం రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. అయితే లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు కూడా ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు.

లబ్ధిదారుడు మరణిస్తే వారి వారసులు ఈ పథకం ప్రయోజనం పొందుతారు. అంతేకానీ డబ్బులు రావడం ఆగిపోదు. అయితే దీనికి వారి వారసులు కొన్ని నియమాలని పాటించాలి. ఆ రైతు వారసుడు పోర్టల్‌లో ప్రత్యేకంగా పేరు నమోదు చేసుకోవాలి. అంతే కాదు ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి షరతులను నెరవేరుస్తున్నాడా లేదా అనేది చూసుకోవాలి. అప్పుడు ఈ పథకం ప్రయోజనం పొందుతాడు.

మీ ఇన్‌స్టాల్‌మెంట్‌ స్టేటస్‌ని ఇలా తెలుసుకోండి..

1. ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. తర్వాత ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

4. కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

5. ఇక్కడ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

6. తర్వాత మీ స్టేటస్‌ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.

Tags:    

Similar News