PM Kisan: మీరు ఈ తప్పు చేస్తే తిరిగి చెల్లించాల్సిందే.. లేదంటే నోటీసులు..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులకు అందించారు.

Update: 2022-06-25 06:30 GMT

PM Kisan: మీరు ఈ తప్పు చేస్తే తిరిగి చెల్లించాల్సిందే.. లేదంటే నోటీసులు..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులకు అందించారు. మే 31న ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ రైతుల ఖాతాలో 11వ విడతను జమ చేశారు. అయితే కొంతమంది ఈ పథకాన్ని తప్పుడు మార్గంలో సద్వినియోగం చేసుకున్నారనే ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. గతంలో కూడా ఈ పథకాన్ని తప్పుడు మార్గంలో సద్వినియోగం చేసుకున్న వ్యక్తులకు ప్రభుత్వం నోటీసులు పంపింది.

ఈ పథకం లబ్ధిదారుల కోసం ప్రభుత్వం సామాజిక తనిఖీని కూడా ప్రారంభించింది. ఈ తనిఖీ ఉద్దేశ్యం తప్పు మార్గంలో పథకం ప్రయోజనాన్ని పొందిన వారిని గుర్తించడం. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మీరు తప్పుగా ఈ డబ్బుని పొందినట్లయితే ఈ పనిచేయండి. PM కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో రీఫండ్ చేసే ఎంపిక రైతు కార్నర్‌లో కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్‌ అయ్యే వెబ్ పేజీలో మొత్తం సమాచారాన్ని ఎంటర్‌ చేయండి. తర్వాత ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

ఇప్పుడు డబ్బు తిరిగి ఇవ్వాలా వద్దా అనేది స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి 'డేటా పొందండి'పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 'మీరు రీఫండ్ అమౌంట్‌కు అర్హులు కాదు' అనే మెస్సేజ్‌ చూస్తే మీరు డబ్బును రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. రీఫండ్ అమౌంట్ మెసేజ్ ఇక్కడ కనిపిస్తే మీరు డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. మీరు డబ్బును తిరిగి ఇవ్వకపోతే ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి నోటీసు రావొచ్చు.

Tags:    

Similar News