PM Kisan:15వ తేదీ వరకు ఈ 3 పనులు చేయకుంటే రూ.2000 మరిచిపోండి..!
PM Kisan: మీరు పీఎం కిసాన్ పథకం నుంచి ప్రయోజనం పొందుతున్నట్లయితే కచ్చితంగా ఈ అప్‌డేట్ తెలుసుకోవాలి.
PM Kisan: మీరు పీఎం కిసాన్ పథకం నుంచి ప్రయోజనం పొందుతున్నట్లయితే కచ్చితంగా ఈ అప్‌డేట్ తెలుసుకోవాలి. దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.2000 ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 15వ విడత లబ్ధి పొందాలంటే రైతులు 3 పనులను తొందరగా పూర్తిచేయాలి. అక్టోబర్ 15లోపు ఈ పనులు పూర్తి చేయలేకపోతే రూ. 2000 గురించి మరిచిపోవాల్సిందే. ఈ మూడు పనులు పూర్తిచేసిన వారికే పీఎం కిసాన్ 15వ విడత డబ్బులు అకౌంట్లో జమవుతాయి.
5 రోజులే మిగిలి ఉన్నాయి
పీఎం కిసాన్ లబ్ధిదారులు e-KYC పూర్తి చేయడం చాలా అవసరం. మీరు ఇంకా KYC చేయకుంటే తదుపరి వాయిదా డబ్బులు అందవు. ఇది కాకుండా మీరు భూమి తేదీ సీడింగ్ గురించి సమాచారం అందించాలి. అలాగే బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. అక్టోబరు 15 వరకు రైతులు ఈ 3 పనులు పూర్తిచేయాలి. ఇప్పుడు ఇంకా 5 రోజుల సమయం మిగిలి ఉంది.
పథకం ప్రయోజనం పొందలేరు
పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు e-KYCని పొందడం చాలా అవసరం. ఒకవేళ KYC చేయకపోతే పథకం ప్రయోజనం పొందలేరని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈకేవైసీ చేయడం వల్ల నవంబర్‌లో లేదా అంతకు ముందు విడత ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ప్రస్తుతం తదుపరి విడత తేదీ గురించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ మీరు 15వ విడత స్టేటస్ తెలుసుకోవాలంటే pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.