PM Kisan: 8 రోజులు గడిచినా మీ అకౌంట్లో డబ్బులు పడలేదా.. కారణం ఏంటో తెలుసుకోండి..!
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రధాని నరేంద్రమోడీ రైతుల ఖాతాలో 11వ విడత డబ్బులని మే 31వ తేదీన విడుదల చేశారు.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రధాని నరేంద్రమోడీ రైతుల ఖాతాలో 11వ విడత డబ్బులని మే 31వ తేదీన విడుదల చేశారు. ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటికీ చాలా మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. తమ ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు రాలేదని చాలామంది రైతులు ఆందోళన పడుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి రైతులు హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయవచ్చు.
మే 31న సిమ్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి 11వ విడత 2000 రూపాయలను బదిలీ చేశారు. దేశంలోని 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.21,000 కోట్లు పంపారు. మూడో రోజు కూడా మీ ఖాతాలో డబ్బులు రాకపోతే ఈ నంబర్లకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. చాలా మంది పేర్లు మునుపటి జాబితాలో ఉన్నాయి. కానీ కొత్త జాబితాలో లేవు. చివరిసారి డబ్బు వచ్చింది కానీ ఈసారి రాలేదు. అప్పుడు మీరు పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయవచ్చు.
ఈ నెంబర్లకి కాల్ చేసి సమస్య గురించి కంప్లెయింట్ చేయండి..
1. PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
2. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్:155261
3. PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011-23381092, 23382401
4. PM కిసాన్ కొత్త హెల్ప్‌లైన్: 011-24300606
5. PM కిసాన్‌కు మరో హెల్ప్‌లైన్ నెంబర్: 0120-6025109
6. ఈ-మెయిల్ ఐడీ : pmkisan-ict@gov.in
వాస్తవానికి కొంతమంది రైతులు కేవైసీ చేసుకోకపోవడం వల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. వారు వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీని స్మార్ట్‌ఫోన్‌లో కూడా చెయ్యొచ్చు కానీ మీ ఆధార్ మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ ఆధార్‌కు లింక్ లేకుంటే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీసేవలోకి వెళ్లి మీ ఆధార్‌తో ఫోన్ నెంబర్‌ను లింక్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.
Also Read
PM Kisan: అర్హులు కాకున్నా పీఎం కిసాన్ డబ్బులు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?