PM Kisan: రైతులకి మరో శుభవార్త.. పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు ఎప్పుడంటే..?
PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్దిదారు అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది.
PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్దిదారు అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. పీఎం కిసాన్ యోజన 12వ విడతను ప్రధాని మోదీ త్వరలో విడుదల చేయనున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం. ఆగస్ట్‌లో 12వ విడత డబ్బులు అందించడానికి సన్నాహాలు మొదలవుతున్నాయి. వాస్తవానికి ఈ పథకం కింద రైతులకు మొదటి విడత ఏప్రిల్ 1, జూలై 31 మధ్య అందిస్తారు. రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య ఉంటుంది. మూడో విడత డిసెంబర్ 1, మార్చి 31 మధ్య బదిలీ అవుతుంది. దీని ప్రకరాం రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్య ఉంటుంది.
మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే పరిష్కరించండి. దీని కోసం మీరు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా మెయిల్ ఐడి ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. లేదంటే ఈ-మెయిల్ ఐడి ( pmkisan-ict@gov.in )లో మెయిల్ చేయవచ్చు.
మీ స్టేటస్ చెక్ చేయండి..
1. ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని చూడటానికి మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
5. ఇక్కడ మీరు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
6. తర్వాత మీరు మీ స్టేటస్ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.