PM Kisan: రైతులకు అలర్ట్.. రేపే చివరి రోజు.. ఈ పని మిస్ చేశారంటే.. ఒక్క రూపాయి కూడా రాదంతే..!

PM Kisan 14th Installment: రైతుల ఈ-కేవైసీ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ దృష్ట్యా, అనేక జిల్లాల్లో జిల్లా మెజిస్ట్రేట్‌ల ద్వారా రైతుల ఈ-కేవైసీ బ్లాక్ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

Update: 2023-06-14 06:12 GMT

PM Kisan: రైతులకు అలర్ట్.. రేపే చివరి రోజు.. ఈ పని మిస్ చేశారంటే.. ఒక్క రూపాయి కూడా రాదంతే..!

PM Kisan EKYC: దేశంలోని కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. 14వ విడతలో రూ.2000లు ఈ నెలలోనే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పదే పదే చెబుతున్నట్లుగా, ఈ-కేవైసీ, భూమి ధృవీకరణ పని పూర్తయిన రైతులకు మాత్రమే వాయిదాల డబ్బు వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో e-KYCని సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం.

ఈ-కేవైసీకి చివరి తేదీ జూన్ 15..

పీఎం కిసాన్ కోసం e-KYCకి చివరి తేదీ (E-Kyc Last Date) జూన్ 15. దీని ప్రకారం, e-KYC పూర్తి చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో రైతుల ఇ-కేవైసీ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ దృష్ట్యా, అనేక జిల్లాల్లో జిల్లా మెజిస్ట్రేట్‌ల ద్వారా రైతుల ఈ-కేవైసీ బ్లాక్ స్థాయిలో నిర్వహిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వం నుంచి అర్హులైన రైతులకు ఏటా 6 వేల రూపాయలు అందజేస్తారు.

eKYC ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే..

- PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇక్కడ కుడివైపున ఇచ్చిన EKYC ఎంపికపై క్లిక్ చేయండి.

ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఇప్పుడు సెర్చ్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.

ఇది కాకుండా, మీరు PM కిసాన్ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, డబ్బు పొందడానికి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. మీరు నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో కనిపిస్తుంది. లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం?

లబ్ధిదారుల జాబితాను ఎలా తనిఖీ చేయాలంటే..

- ముందుగా PM కిసాన్ పోర్టల్‌కి వెళ్లండి.

ఇక్కడ 'బెనిఫిషియరీ లిస్ట్'పై క్లిక్ చేయండి.

ఇప్పుడు రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామం ఎంచుకోండి.

నివేదికను పొందడానికి ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Tags:    

Similar News