రైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చెందిన 10 కోట్ల మందికి పైగా రైతులకు ప్రభుత్వం మరోసారి పెద్ద ఉపశమనం కలిగించింది.
PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి చెందిన 10 కోట్ల మందికి పైగా రైతులకు ప్రభుత్వం మరోసారి పెద్ద ఉపశమనం కలిగించింది. e-KYC చివరి తేదీని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యవసాయం,రైతు సంక్షేమ శాఖ e-KYC చివరి తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఇంతకుముందు ఈ తేదీ జూలై 31గా ఉండేది. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఇప్పటివరకు చాలా తక్కువ మంది రైతులు ఈ-కెవైసి చేశారు. దీని కారణంగా ప్రభుత్వం మరోసారి తేదీని పొడిగించింది.
e-kyc చేయని రైతులకు 12వ విడత ప్రభుత్వం ఇవ్వదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. e-kyc తేదీని ప్రభుత్వం మార్చి 31 నుంచి మే 31 తర్వాత జూలై 31కి పెంచారు. ఇప్పుడు దీనిని ఆగస్టు 31కి వరకు పెంచారు. అయితే దీని తర్వాత చివరి తేదీని పెంచే అవకాశం ఉండదని చెబుతున్నారు. అందుకే ఈ కేవైసీ చేయని రైతులు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
12వ విడతలో రూ.4 వేలు..
పీఎం కిసాన్ నిధి 12వ విడతకు సంబంధించిన డబ్బు ఆగస్టు,సెప్టెంబర్ మధ్య వస్తుంది. 12వ విడత సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.అంతకుముందు మే 31న పిఎం మోడీ 2 వేల రూపాయల పిఎం కిసాన్ ఫండ్ రైతుల ఖాతాకు బదిలీ చేశారు. అయితే 11వ విడత డబ్బులు అందని రైతులకు ఈసారి 12వ విడతగా రూ.4వేలు అందజేయనున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ సొమ్మును ప్రతి ఏటా రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా రైతులకు అందజేస్తున్నారు.