PM Kisan: వీరికి పీఎం కిసాన్ డబ్బులు రావు.. 20వ విడుత నిధులకు మీరు అర్హులా? ఇలా చెక్ చేసుకోండి..!
PM Kisan 20th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడుత నిధులు విడుదల అతి త్వరలోనే చేయనుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా పీఎం కిసాన్ 20వ విడుత నిధులకు అర్హులు అవుతారా? ఇలా చెక్ చేసుకోండి.

PM Kisan: పీఎం కిసాన్ 20వ విడుత నిధులకు మీరు అర్హులా? ఇలా చెక్ చేసుకోండి..!
PM Kisan 20th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. ప్రతి చిన్నా సన్నకారు రైతుల వ్యవసాయ పెట్టుబడులకు చేయూతగా ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది.
ఏడాదిలో మూడు సార్లు ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమా చేస్తారు. జూన్ నెలలో 20వ విడుత పీఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే, మీరు ముందుగానే ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. మొబైల్ నంబర్ బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉండాలి. అప్పుడే పీఎం కిసాన్ నిధులకు మీరు అర్హులు అవుతారు.
పీఎం కిసాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ PMKisan.in ఓపెన్ చేయాలి. అక్కడ మీరు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి. అప్పుడు మీ ఫోన్‌కు ఓ ఓటీపీ వస్తుంది. పోర్టల్‌లో చెప్పిన విధంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. 20వ విడుత నిధులు పొందడానికి తక్షణమే ఈ పని పూర్తి చేయండి.
20వ విడుత నిధులు వీరికి రావు..
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడుత నిధులు ఇకేవైసీ లేకపోతే జమా కావు. అంతేకాదు వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నా అర్హులు కాదు. అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు దొర్లినా ఈ లాభం పొందలేరు. మీ భూరికార్డులు కూడా సరిగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే పీఎం కిసాన్ 20వ విడుత నిధులు మీరు పొందలేరు.
2024 అక్బోబర్ 5వ తేదీ పీఎం కిసాన్ నిధులు 18వ విడుత నిధులను రైతుల ఖాతాల్లో జమా చేశారు. ఈ నిధులతో కొన్ని కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. 2025 ఫిబ్రవరి 24వ తేదీ 19వ విడుత పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమా చేసింది. ప్రస్తుతం వారు 20వ విడుత నిధుల విడుదలకు ఎదురు చూస్తున్నారు. జూన్ చివరి వారంలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు.