PM Kisan: పీఎం కిసాన్ పదకొండో విడతలో మీ పేరు లేదా.. వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి..!
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడనుంది.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడనుంది. మే 31న (మంగళవారం) దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులని విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్న రైతుల పేర్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in లో ఉంటాయి. మీరు కూడా ఈ స్కీమ్‌కు అర్హులైతే మీరు వెబ్‌సైట్ ద్వారా జాబితాలో మీ పేరును చెక్ చేసుకోవచ్చు. వాస్తవానికి11వ విడత విడుదలకు ముందే ఈ-కెవైసి పూర్తి చేయాలని ప్రభుత్వం రైతులను కోరింది. ఇంతకుముందు దీనికి చివరి తేదీ మార్చి 31 కానీ తరువాత ప్రభుత్వం దానిని మే 31 వరకు పొడిగించింది. ఇప్పుడు మే 31న ప్రభుత్వం ఖాతాల్లో డబ్బులు విడుదల చేయనుంది.
జాబితాలో మీ పేరుని ఇలా చెక్ చేసుకోండి..?
1. PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ని సందర్శించండి .
2. ఇప్పుడు 'కార్నర్'లో ఇచ్చిన బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం గురించిన సమాచారం అడుగుతుంది.
4. మొత్తం సమాచారాన్ని నింపిన తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి.
5. ఇక్కడ ఒక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరును చెక్ చేయవచ్చు.
6. జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే PM కిసాన్ నిధి 2000 రూపాయలు ఖాతాలోకి వస్తాయి.
మీ పేరు లేకుంటే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి
జాబితాలో మీ పేరు లేకుంటే మీ జిల్లాకు చెందిన సంబంధిత నోడల్ అధికారిని సంప్రదించి జాబితాలో పేరు లేకపోవడానికి గల కారణాన్ని తెలుసుకోండి. రెండో విడత జాబితాలో కూడా మీ పేరు కనిపించకపోతే హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయండి. ఈ నెంబర్‌కి కాల్ చేసి మీ పేరు, ఇతర వివరాలను అందించి సమాచారాన్ని పొందవచ్చు. e-KYC చేయని రైతుల డబ్బు ఆగిపోవచ్చు. ఈ పరిస్థితిలో వీరు e-kyc పూర్తి చేయాలి. మీరు దీన్ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేయవచ్చు.