Ola E Scooter: త్వరలో భారత మార్కెట్లోకి "ఓలా ఇ-స్కూటర్" ధర ఎంతంటే..!!
Ola E Scooter: భారత్ లో ప్రస్తుతం బైక్ మరియు కార్ల రైడ్ షేరింగ్ లో అగ్రగామిగా ఉన్న ఉన్న ఓలా సంస్థ త్వరలోనే..
Ola E Scooter: భారత్ లో ప్రస్తుతం బైక్ మరియు కార్ల రైడ్ షేరింగ్ లో అగ్రగామిగా ఉన్న ఉన్న ఓలా సంస్థ త్వరలోనే భారత మోటార్ వెహికిల్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఎలక్ట్రికల్ వెహికిల్ లకి పోటీగా "ఓలా ఇ-స్కూటర్" ను అతి త్వరలో వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఈ విషయాన్నీ తాజాగా ఓలా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తమిళనాడులో ఉన్నఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీలో ఈ బైకులను తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బైక్ తయారికి రోబోలను ఉపయోగించడం వలన సమయం మరియు వాహనాల తయారీ కూడా త్వరగా జరగనుంది.
ఓలా ఇ-స్కూటర్ 1155 వాట్స్ కెపాసిటీతో రానుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 150-160 కిలోమీటర్లు తిరగొచ్చు. స్కూటర్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎంత శాతం ఛార్జింగ్ అయిందో స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోవచ్చు. అయితే "ఓలా ఇ-స్కూటర్" ధర దాదాపుగా ఒక లక్ష నుండి లక్ష 20 వేల వరకు ఉండోచ్చని సమాచారం. ఇక "ఓలా ఇ-స్కూటర్"తో ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించబోతుందనే చెప్పాలి. ప్రస్తుతం రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో విసిగిపోతున్న జనాలు ఈ ఎలక్ట్రికల్ వెహికిల్ వైపు మొగ్గు చూపుతుండటంతో త్వరలో రాబోతున్న "ఓలా ఇ-స్కూటర్" పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.