Retirement Plan: ఉద్యోగులకి అలర్ట్‌.. రిటైర్మెంట్‌ ప్లాన్ చేశారా..!

Retirement Plan: రిటైర్మెంట్‌ తర్వాత ప్రతి ఒక్కరు వృద్ధాప్య ఖర్చుల గురించి ఆలోచిస్తారు.

Update: 2022-08-27 13:00 GMT

Retirement Plan: ఉద్యోగులకి అలర్ట్‌.. రిటైర్మెంట్‌ ప్లాన్ చేశారా..!

Retirement Plan: రిటైర్మెంట్‌ తర్వాత ప్రతి ఒక్కరు వృద్ధాప్య ఖర్చుల గురించి ఆలోచిస్తారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏదైనా రిటైర్మెంట్‌ ప్లాన్‌ ప్రారంభించడం అవసరం. మీరు ఉద్యోగంలో చేరిన వెంటనే రిటైర్మెంట్‌ కోసం డబ్బు ఆదా చేయడం ప్రారంభించాలి. వాస్తవానికి మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే మీకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది. EPF, NPS, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో నిధులను సేకరించేందుకు అనేక పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి.

రిటైర్మెంట్ తర్వాత సురక్షితంగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని రూపొందించింది. అందులో ప్రముఖమైనది నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్ (NPS). ఇది ఈక్విటీ, డెట్ సాధనాలు రెండింటినీ కలిగి ఉన్న ప్రభుత్వ పెన్షన్ పథకం. NPS ప్రభుత్వం నుంచి హామీని కలిగిన ఒక స్కీం. రిటైర్మెంట్‌ తర్వాత అధిక నెలవారీ పెన్షన్ పొందడానికి మీరు NPS పథకంలో పెట్టుబడి పెడితే మీ భవిష్యత్‌ బాగుంటుంది.

ఆదాయపు పన్ను మినహాయింపు

NPS పెన్షన్ పథకం అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రభుత్వ పథకాలాలాంటిది. ఇందులో పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ మొత్తాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. NPS ద్వారా మీరు సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. మీరు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఎన్‌పిఎస్‌లో రెండు రకాలు ఎన్‌పిఎస్ టైర్ 1, ఎన్‌పిఎస్ టైర్ 2. టైర్-1లో కనీస పెట్టుబడి రూ.500 కాగా టైర్-2లో రూ.1000. అయితే పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. NPSలో మూడు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పెట్టుబడిదారు తన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంచుకోవాలి. ఈక్విటీ, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ బాండ్లు. ఈక్విటీలకు ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో అధిక రాబడిని ఇస్తుంది. మీరు మీ పెట్టుబడి సలహాదారుతో మాట్లాడిన తర్వాతే ఏదైనా పెట్టుబడి పెట్టాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News