రిటైర్మెంట్ తర్వాత నెలకి రూ.75,000 పెన్షన్.. ఈ మార్గంలో చాలా సులువు..!
రిటైర్మెంట్ తర్వాత నెలకి రూ.75,000 పెన్షన్.. ఈ మార్గంలో చాలా సులువు..!
NPS Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ.75,000 పెన్షన్ కావాలంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో (NPS)పెట్టుబడి పెట్టవచ్చు . రిటైర్మెంట్ ప్లాన్‌కి NPS ఉత్తమ ఎంపిక. అంతేకాదు ఇది ఒక ప్రభుత్వ పథకం. ఇందులో డబ్బును క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత పెద్ద ఫండ్ క్రియేట్ చేయవచ్చు. NPS ప్లాన్‌లో చందాదారుడు మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు అలాగే నెలకు స్థిరమైన పెన్షన్ పొందడానికి యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పదవీ విరమణ తర్వాత ఖర్చుల కోసం ప్రతి నెలా నిర్ణీత మొత్తం అవసరమయ్యే వారికి NPS ఉత్తమంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆదాయ వనరులు లేనప్పుడు.NPS పెట్టుబడిలో తక్కువ రిస్క్ ఉంటుంది. PPF (పబ్లిక్ ఫ్రావిడెంట్ ఫండ్) ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. ఎన్‌పిఎస్ కింద సబ్‌స్క్రైబర్‌కు యాక్టివ్, ఆటో అనే రెండు ఎంపికలలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.
75000 పెన్షన్
యాక్టివ్ ఛాయిస్‌లో కస్టమర్ తన డబ్బును స్టాక్‌లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తారు. మొత్తం NPS పెట్టుబడిలో 75% యాక్టివ్ ఛాయిస్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. వాస్తవానికి నెలకు రూ.75,000 పెన్షన్ రావాలంటే 60 ఏళ్లలో ఎన్‌పిఎస్ మెచ్యూరిటీ మొత్తం రూ.3.83 కోట్లు అయి ఉండాలి. మెచ్యూరిటీ సమయంలో యాన్యుటీ ప్లాన్ నుంచి ఈ డబ్బు అందుతుంది.
10,000తో పెట్టుబడి
25 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్లపాటు ప్రతి నెలా రూ.10,000 ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడనుకుందాం. ప్రతి సంవత్సరం 10% రాబడితో 60 ఏళ్ల వయస్సులో రూ.3,82,82,768 జమ అవుతుంది. ఈ మొత్తంలో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే ప్రతి నెలా రూ.76,566 పెన్షన్ లభిస్తుంది. 30 ఏళ్ల వారు ప్రతి నెలా ఎన్‌పిఎస్‌లో రూ. 16,500 ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ తర్వాత సులువుగా రూ.75,218 పెన్షన్ లభిస్తుంది.