Noel Tata: టాటా ట్రస్టుల చైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో నోయెల్ టాటా
Who is Noel Tata: టాటా ట్రస్టుల చైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో ఆయన సోదరుడు నోయెల్ టాటా నియమితులయ్యారు.
Who is Noel Tata: టాటా ట్రస్టుల చైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో ఆయన సోదరుడు నోయెల్ టాటా నియమితులయ్యారు. రతన్ టాటాకు నోయెల్ టాటా హాఫ్ బ్రదర్ అవుతారు. అంటే రతన్ టాటా తల్లిదండ్రులు విడిపోయిన తరువాత తన తండ్రి నావల్ టాటా మరో పెళ్లి చేసుకున్నారు. అలా తన పిన తల్లి సైమన్ టాటాకు పుట్టిన కుమారుడే ఈ నోయెల్ టాటా.
ఇప్పటికే టాటా గ్రూపులోని కొన్ని సంస్థల్లో నోయెల్ టాటా ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. ట్రెంట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు నోయెల్ టాటానే చైర్మన్‌గా ఉన్నారు. అలాగే టాటా ఇంటర్నేషనల్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో మొదలైన ట్రెంట్ సంస్థను వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దడంలో నోయెల్ టాటా పాత్ర కీలకం అని చెబుతారు. అంతేకాకుండా ఇండియాలో సిస్లె, జరా బ్రాండ్స్ లాంచ్ చేసిన ఘనత కూడా నోయెల్ టాటాదే.
టాటా ఇంటర్నేషనల్ వైపు నుండి వొల్వెరిన్ వరల్డ్ వైడ్ అనే అమెరికన్ ఫుట్ వేర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీతో చేతులు కలిపి ఆ సంస్థను ఇండియాకు తీసుకొచ్చింది కూడా నోయేల్ టాటానే. ఇలా టాటా గ్రూప్ సంస్థ వ్యాపారాల్లో నోయెల్ టాటా కూడా తన పని తాను చేసుకుపోయారు. ఇవేకాకుండా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్టులకు నోయెల్ టాటా ట్రస్టీగా ఉన్నారు.
రతన్ టాటా సొంత సోదరుడు జిమ్మీ టాటా ముందు నుండి ఈ వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉంటూ చాలా సాధారణ జీవితం గడుపుతూ వస్తున్నారు. వారసత్వంలో భాగంగా ఆయన పేరుపై కూడా టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్ లాంటి అనేక కంపెనీలకు చెందిన షేర్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇక టాటా గ్రూప్ వ్యాపారాల్లో రతన్ టాటా తరువాత ప్రస్తుత తరంలో అంత చురుకుగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఈ నోయెల్ టాటానే. అలా ఇప్పటివరకు రతన్ టాటా చేతిలో ఉన్న టాటా ట్రస్టుల పగ్గాలు నోయెల్ టాటా చేతికి వచ్చాయి.