10 లక్షల ఆదాయంపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. పన్ను ఆదా చిట్కాలు తెలుసుకోండి..!

Tax Saving Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇంకా పన్ను చెల్లించకపోతే వెంటనే చెల్లించండి.

Update: 2023-01-21 08:30 GMT

10 లక్షల ఆదాయంపై కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. పన్ను ఆదా చిట్కాలు తెలుసుకోండి..!

Tax Saving Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇంకా పన్ను చెల్లించకపోతే వెంటనే చెల్లించండి. 2.5 లక్షల కంటే ఎక్కువ జీతం ఉన్నవారు పన్ను చెల్లించాలని అందరికి తెలుసు. అయితే మీ జీతం కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటే తెలివిగా ఆలోచించడం ముఖ్యం. 10.5 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా సులువుగా బయటపడవచ్చు. పన్ను ఆదా చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), ELSS కింద పెట్టుబడి పెడితే 80C కింద మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. తర్వాత మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.8.5 లక్షలు మాత్రమే. NPS వంటి పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల సెక్షన్ 80CCD (1B) కింద రూ.50,000 అదనపు మినహాయింపు పొందుతారు. ఈ పరిస్థితిలో పన్ను చెల్లించదగిన జీతం 8 లక్షలు మాత్రమే అవుతుంది.

హోమ్ లోన్

హోమ్‌ లోన్‌ వడ్డీపై రాయితీ లభిస్తుంది. మీరు గృహ రుణం తీసుకొని దాని వడ్డీని చెల్లించినట్లయితే ఆ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు పన్ను రాయితీని పొందవచ్చు. మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 24(బి) కింద ఈ మినహాయింపు పొందుతారు. గృహ రుణ పన్ను మినహాయింపు వడ్డీ చెల్లింపుపై మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి.

ఆరోగ్య బీమాపై మినహాయింపు

మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య బీమాను కలిగి ఉన్నట్లయితే రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. మరోవైపు సీనియర్-సిటిజన్ల కోసం ఆరోగ్య బీమాను కొనుగోలు చేసినట్లయితే మీరు రూ.50,000 వరకు తగ్గింపును పొందవచ్చు. మొత్తం మినహాయింపు పరిమితి రూ.75,000 అవుతుంది. ఈ సందర్భంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఇక రూ.5.25 లక్షలు మాత్రమే.

విరాళంపై మినహాయింపు

మీరు ఒక సంవత్సరంలో కొంత విరాళం చేస్తే రూ.25,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇప్పుడు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 5 లక్షలు మాత్రమే. ఈ సందర్భంలో రూ. 2.5 లక్షలలో 5% చొప్పున రూ.12,500 మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో సెక్షన్ 87A కింద మీరు 12,500 పన్ను మినహాయింపు పొందుతారు. మీరు 5 లక్షల పన్ను శ్లాబ్‌లో ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News