LPG Gas Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న గ్యాస్ ధర.. ఎప్పటినుంచంటే?

Gas Price: దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా కొత్త గ్యాస్ ధర విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాయి. ఇది సాధారణ ప్రజలకు భారీ ఉపశమనం ఇచ్చేలా ఉన్నాయి.

Update: 2023-04-15 08:48 GMT

LPG Gas Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న గ్యాస్ ధర.. ఎప్పటినుంచంటే?

Gas Price: దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ ధరలను తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులకు భారీ ఊరట కలగనుంది. కొత్త గ్యాస్ ధరల విధానాన్ని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నాయి. దీనితో పాటు గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి. కొత్త గ్యాస్ ధరల విధానం ఓఎన్‌జీసీ (ONGC), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) వంటి గ్యాస్ కంపెనీల ఆదాయాన్ని తగ్గించనుందంట.

సమస్యాత్మక ప్రాంతాల్లో నో ఎఫెక్ట్..

ఈ విషయాన్ని ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ శుక్రవారం తెలియజేసింది. అయితే, కొత్త నిబంధనలు సమస్యాత్మక ప్రాంతాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరలపై ఏమాత్రం ప్రభావం చూపవని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు అలాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి.

ఏప్రిల్ 6 నుంచి కొత్త మార్గదర్శకాలు..

ప్రభుత్వం ఏప్రిల్ 6, 2023న కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. దీని కింద దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధరలను ప్రభుత్వం నెలవారీగా నిర్ణయిస్తుంది. ఈ రేటు అంతకుముందు నెలలో భారత క్రూడ్ బాస్కెట్ అంటే భారతదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధరలో 10 శాతంగా ఉండేలా నిర్ణయిస్తారంట.

ఇంతకుముందు, గ్యాస్ ధరలపై 6 నెలలకు ఒకసారి సమీక్ష జరిగేది. కొత్త మార్గదర్శకాల మేరకు ఇకపై నెలవారీగా గ్యాస్ రేటును నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. "కొత్త గ్యాస్ ధర నిబంధనలతో ప్రజలకు మేలు కలుగుతుంది. ఇకపై ధరల సవరణ నెలకొసారి జరుగుతుంది" అని S&P గ్లోబల్ రేటింగ్స్‌లో క్రెడిట్ అనలిస్ట్ శ్రుతి జాటాకియా పేర్కొన్నారు.

అంతర్జాతీయ సహజవాయువు ధరలు చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ONGC దాని గ్యాస్ ఉత్పత్తిపై యూనిట్‌కు కనీసం $ 4 ధరను పొందగలదని ఎస్ అండ్ పీ ఓ ప్రటకనలో పేర్కొంది. అదేవిధంగా, ధరలపై గరిష్ట పరిమితితో ONGCకి ఆదాయ వృద్ధిని పరిమితం చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. దీంతో ముఖ్యంగా ప్రస్తుతం పెరిగిన ధరల మధ్య భారీ వత్యాసాన్ని ఇది చూపిస్తుందని ప్రకటించింది.

Tags:    

Similar News