Business idea: కళ్లు చెదిరే లాభాలు.. పేపర్‌ బ్యాగ్‌ తయారీతో భారీగా ఆదాయాలు

How to start paper bag making business: సాధారణంగా పేపర్‌ బ్యాగ్‌ తయారీ పరిశ్రమను ప్రారంభించాలంటే ముఖ్యంగా మూడు మిషన్స్‌ కావాలి.

Update: 2024-10-12 15:39 GMT

How to start paper bag making business

How to start paper bag making business: రోజులు మారుతున్నాయి, మారిన కాలానికి అనుగుణంగా వ్యాపార ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నాయి. మార్కెట్‌ అవసరాలతో పాటు, మార్కెట్లో ట్రెండీ బిజినెస్‌ను స్టార్ట్ చేయడం వల్ల భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి కొన్ని బెస్ట్ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రభుత్వాలు ప్లాస్టిక్స్‌ వినియోగాన్ని భారీగా తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్లాస్టిక్‌ కవర్స్‌పై నిషేధం విధించారు. ఈ క్రమంలోనే పేపర్‌ బ్యాగ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. చిన్న చిన్న దుకాణాలు మొదలు, పెద్ద పెద్ద షాపుల వరకు పేపర్‌ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. ఈ పేపర్‌ బ్యాగుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ పేపర్‌ బ్యాగ్‌ల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పేపర్‌ బ్యాగ్‌ తయారీ పరిశ్రమను ప్రారంభించాలంటే ముఖ్యంగా మూడు మిషన్స్‌ కావాలి. వీటిలో ఒకటి.. పేపేర్‌ బ్యాగ్‌ మేకింగ్ మిషన్‌. ఇందులో విత్‌ ప్రింట్ కూడా ఉంటుంది. కస్టమర్స్‌ అవసరాలకు అనుగుణంగా ప్రింట్ చేయొచ్చు. ఈ మిషిన్స్‌ ప్రారంభ ధర రూ. 3 లక్షల నుంచి మొదలవుతుంది. క్రేజింగ్ మిషన్‌, హైలెట్ పంచ్‌ మిషన్‌ అవసరపడుతుంది. ఇక పేపర్‌ బ్యాగ్‌ల తయారీకి కొంతమేర స్థలం కావాల్సి ఉంటుంది. 3 ఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాగులను తయారు చేసిన తర్వాత మీరే సొంతంగా బ్రాండింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు.

ఇక లాభాల విషయానికొస్తే.. ఒక కేజీ పేపర్‌ బ్యాగుల తయారీకి రూ. 30 నుంచి రూ. 35 వరకు ఖర్చవుతుంది. వీటిని రూ. 60 వరకు అమ్ముకోవచ్చు. అంటే కిలో పేపర్ బ్యాగులను విక్రయిస్తే కనీసం రూ. 30 లాభం ఆర్జించవచ్చు. ఈ మిషిన్స్‌ సహాయంతో రోజుకు 700 కిలోల పేపర్‌ బ్యాగులను తయారు చేయవచ్చు. అంటే రోజుకు రూ. 18,000 వరకు ఆదాయం పొందొచ్చు.

Tags:    

Similar News