Business Idea: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా.? రోజుకు రూ. వెయ్యి సంపాదించే అవకాశం

Business Idea: మహిళలు ఇంట్లో పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఉండే ఖాళీ సమయాల్లో కూడా ఆదాయం ఆర్జిస్తున్నారు.

Update: 2024-10-09 09:00 GMT

Business Idea: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా.? రోజుకు రూ. వెయ్యి సంపాదించే అవకాశం

Business Idea: మహిళలు ఇంట్లో పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఉండే ఖాళీ సమయాల్లో కూడా ఆదాయం ఆర్జిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తూ తమదైన శైలిలో డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్ అందుబాటులోకి రావడం, మార్కెట్ అవసరాలు కూడా మారడంతో చాలా మంది ఇంట్లోనే ప్రారంభించేందుకు వీలున్న వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు మంచి, మంచి వ్యాపారాలతో రాణిస్తున్నారు. అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎవరి అసరం లేకుండా ఒక్కరే ఈ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అది కూడా రూ. 20 వేల నామమాత్రపు పెట్టుబడితో బిజినెస్‌ ప్రారంభించే అవకాశం ఉంది. అదే బాల్ పెన్‌ మేకింగ్ బిజినెస్‌. బెస్ట్ సైడ్‌ ఇన్‌కమ్‌లాగా ఉపయోగపడే ఈ బాల్‌ పెన్‌ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాల.? ఇందులో లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్ పెన్‌ తయారీకి ప్రత్యేకంగా గది కానీ, కరెంట్ కనెక్షన్‌ కానీ అవసరం లేదు. ఇందుకోసం ఐదు రకాల మిషిన్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బాల్‌ పెన్‌ తయారీకి ఇంక్‌ ఫిల్లర్‌, ఆడప్టర్‌ ఫిట్టింగ్ మిషిన్‌, టిఫ్‌ ఫిట్టింగ్‌, నేమ్‌ ప్రింటింగ్‌ మిషన్, సెంట్రి ఫ్యూజ్‌ మిషన్స్ వంటి వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే పెన్స్‌ తయారీకి పెన్స్‌ (బ్యారెల్‌), క్యాప్స్‌, నిబ్స్‌, ఆడపర్లు అవసరపడతాయి.

పెన్‌ తయారీ సామాగ్రి మొత్తం మిషిన్స్‌ను విక్రయించే వారి చోటే లభిస్తాయి. లాభాల విషయానికొస్తే ఒక్క బాల్‌ పెన్‌ తయారీ చేయడానికి సుమారు రూ. 1.50 ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఈ పెన్నులను రూ. 3 నుంచి రూ. 4 వరకు విక్రయించుకోవచ్చు. సరాసరి ఒక్కో పెన్‌పై 75 పైసలు లాభం వస్తుంది. రోజుకు సులభంగా వెయ్యి పెన్నులను తయారు చేసుకోవచ్చు. అలా చూసుకుంటే రోజుకు రూ. 750 సంపాదింవచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించే బెస్ట్ బిజినెస్‌లో ఇదీ ఒకటి కావడం విశేషం. 

Tags:    

Similar News