LIC Amritbaal Policy: ఎల్‌ఐసీ సరికొత్త పాలసీ.. పిల్లల కోసం స్పెషల్‌గా స్టార్ట్‌ చేశారు..!

LIC Amritbaal Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2024-02-18 09:45 GMT

LIC Amritbaal Policy: ఎల్‌ఐసీ సరికొత్త పాలసీ.. పిల్లల కోసం స్పెషల్‌గా స్టార్ట్‌ చేశారు..!

LIC Amritbaal Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. దేశంలోనే అత్యధిక కస్టమర్లు, ఏజెంట్లను కలిగిన సంస్థ. ఇప్పటికే చాలామంది ఇందులో ఇన్వెస్ట్‌ చేశారు. ఎల్‌ఐసీ అన్ని వర్గాల వారికి సరిపోయే జీవిత బీమా పాలసీలను రూపొందిస్తుంది. వీటివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంటోంది. అలాంటి సంస్థ తాజాగా మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. దాని గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ కొత్తగా ‘ఎల్‌ఐసి అమృత్‌బల్‌’ అనే ప్లాన్‌ ప్రవేశపెట్టింది. దీనిని ‘ప్లాన్ 874’ అని కూడా పిలుస్తారు. ఇది పిల్లల కోసం స్పెషల్‌గా రూపొందించారు. 17 ఫిబ్రవరి 2024 నుంచి అందుబాటులో ఉంటుంది. అమృత్‌బల్ ప్లాన్ పర్సనల్‌,సేవింగ్స్‌, ఇన్సూరెన్స్‌ మూడు ప్రయోజనాలను అందిస్తుంది. భవిష్యత్‌లో పిల్లల ఉన్నత చదువులకు ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో ప్రతి రూ.1000 సమ్ అష్యూర్డ్‌కు రూ. 80 నిష్పత్తిలో ఎల్‌ఐసి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.

రూ. 80 మొత్తం బీమా పాలసీకి యాడ్ చేస్తారు. అంటే పిల్లల పేరు మీద రూ.లక్ష ఇన్సూరెన్స్‌ వస్తే ఎల్‌ఐసీ మీ బీమా మొత్తానికి రూ. 8000 యాడ్‌ చేస్తుంది. ఈ హామీతో కూడిన రాబడి ప్రతి సంవత్సరం పాలసీ సంవత్సరం చివరిలో కలుపుతారు. ఇది మొత్తం పాలసీ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతుంది.

30 రోజుల నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ కనీస మెచ్యూరిటీ వయస్సు 18 సంవత్సరాలు. గరిష్టంగా 25 సంవత్సరాలు. ఈ పాలసీకి 5, 6 లేదా 7 సంవత్సరాల షార్ట్‌ టైమ్‌ చెల్లింపు నిబంధనలు అందుబాటులో ఉన్నాయి. గరిష్ట ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాలు. మీరు సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ కూడా తీసుకోవచ్చు.

అయితే ఈ ప్లాన్ కింద కనీసం రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని తీసుకోవాలి. మీరు 5వ, 10వ లేదా 15వ సంవత్సరంలో మనీ బ్యాక్ ప్లాన్ వంటి మెచ్యూరిటీ సెటిల్‌మెంట్ తీసుకోవచ్చు. ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసే వారు మెచ్యూరిటీపై సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్‌ల ప్రయోజనాన్ని పొందుతారు. పాలసీ తీసుకునే వ్యక్తులు ‘మరణంపై హామీ మొత్తం’ (Amount Assured on Death) ఆప్షన్‌ కూడా ఎంచుకోవచ్చు.

Tags:    

Similar News