LIC Pension Policy: ఎల్‌ఐసీ అద్భుత పెన్షన్‌ ప్లాన్‌.. తక్కువ మొత్తంతో ఎక్కువ ఆదాయం..!

LIC Pension Policy: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2023-07-18 13:30 GMT

LIC Pension Policy: ఎల్‌ఐసీ అద్భుత పెన్షన్‌ ప్లాన్‌.. తక్కువ మొత్తంతో ఎక్కువ ఆదాయం..!

LIC Pension Policy: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇది అన్ని వర్గాల వారికి అనుకూలమైన పాలసీలని ప్రవేశపెట్టింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా ఎవ్వరైనా వారికి నచ్చే పాలసీని తీసుకోవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం కంపెనీ ప్రవేశపెట్టిన ఎల్‌ఐసీ జీవన్‌ ఉమాంగ్‌ పూర్తి జీవిత బీమా పథకం. దీని గురించి చాలా మందికి తెలియదు. సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన పాలసీ అని చెప్పవచ్చు. ఇది పాలసీదారుడిపై ఆధారపడిన వారికి ఆర్థిక స్థిరత్వం, ఆదాయ రక్షణని అందిస్తుంది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎల్ఐసీ జీవన్‌ ఉమాంగ్‌ పాలసీలో మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం ఖాతాలోకి స్థిరమైన ఆదాయం పెన్షన్‌ రూపంలో వస్తుంది. మరోవైపు, పాలసీదారు మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, నామినీకి ఏకమొత్తం లభిస్తుంది. ఈ పథకం మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది. జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు. గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన బేబీ కోసం కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. వారు పెరిగిన తర్వాత మంచి రిటర్న్స్ చేతికి వస్తాయి.

కనీస సమ్ అస్యూర్ రూ.2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. జీవన్ ఉమాంగ్‌లో నాలుగు ప్రీమియం టర్మ్స్ ఉన్నాయి. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కనీస, గరిష్ట వయో పరిమితి ఆధారంగా పాలసీ టర్మ్ మారుతుంది. 30 ఏళ్ల కాలపరిమితికి గాను జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవాలనుకుంటే సదరు వ్యక్తి 40 ఏళ్లు ఉండాలి. అంటే పాలసీ 70 ఏళ్లకు పూర్తవుతుంది. కనీసం 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకోవాలి. అంటే ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు 55. తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన చిన్నారి కోసం ఈ పాలసీ తీసుకుంటే 30 ఏళ్లకే పూర్తవుతుంది.

ఈ పాలసీలో ప్రతి నెలా రూ.1302 ప్రీమియం చెల్లిస్తే ఒక సంవత్సరంలో రూ.15,298 అవుతుంది. 30 ఏళ్ల పాటు అమలు చేస్తే మొత్తం రూ.4.58 లక్షలకు చేరుకుంటుంది. పెట్టిన పెట్టుబడిపై కంపెనీ మీకు 31వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 40 వేల రూపాయలు పెన్షన్‌ రూపంలో అందిస్తుంది. 31 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు సంవత్సరానికి 40 వేలు రిటర్న్ తీసుకుంటే దాదాపు 28 లక్షల రూపాయలు లభిస్తాయి. ఈ పాలసీలో ప్రమాదంలో పెట్టుబడిదారుడు మరణించినా లేదా అంగవైకల్యం సంభవించినా టర్మ్ రైడర్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News