ఎల్‌ఐసీ పెన్షన్ పాలసీ.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా రూ.8 వేల పెన్షన్..!
Lic Pension Policy: 60 ఏళ్లు దాటాక ఆదాయం సంపాదించడం చాలా కష్టం. అందుకే ముందుగానే పెన్షన్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం.
Lic Pension Policy: 60 ఏళ్లు దాటాక ఆదాయం సంపాదించడం చాలా కష్టం. అందుకే ముందుగానే పెన్షన్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఇది జీవితానికి ఒక భరోసా కల్పిస్తుంది. ఎవ్వరిపై ఆధారపడకుండా బతకడానికి సహాయం చేస్తుంది. శేష జీవితం హాయిగా సాగుతుంది. ఒకవేళ పెన్షన్ ప్లాన్ లేకుంటే ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది అన్ని వేళల మంచిది కాదు. అందుకే ఎల్‌ఐసీ అందించే ఒక పెన్షన్ ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ జీవన్ శాంతి ప్లాన్ ఒక పెన్షన్ ప్లాన్. ఈ స్కీం ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి పెట్టుబడి పెట్టనవసరం లేదు. ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ కొత్త జీవన్ శాంతి పథకాన్ని ప్రారంభించింది. ఇది వాయిదా వేసిన ఒక యాన్యుటీ ప్లాన్. అంటే ఇందులో పెట్టుబడి పెట్టే సమయంలోనే పెన్షన్ మొత్తం నిర్ణియిస్తారు. నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి నెలా పింఛను రావడం మొదలవుతుంది. కావాలంటే సంవత్సరానికి ఒకసారి కూడా పెన్షన్ తీసుకోవచ్చు.
భార్యాభర్తలిద్దరికీ పెన్షన్
ఎల్‌ఐసీ కొత్త జీవన్ శాంతి పథకంలో 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు ఒకేసారి కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. 1 నుంచి 12 సంవత్సరాల పెట్టుబడి తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది. ఈ పథకం అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే ఒంటరి జీవితంలో అలాగే ఉమ్మడి జీవితంలో పెన్షన్ పొందే సౌకర్యం ఉంటుంది. మీ పేరు మీద అలాగే మీ భార్య పేరు మీద ఈ ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు. తర్వాత భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ అందుతుంది.
రూ.11 లక్షలు డిపాజిట్
మీ వయస్సు 55 సంవత్సరాలు అనుకుంటే కొత్త జీవన్ శాంతి యోజనలో రూ.11 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. 5 సంవత్సరాల తర్వాత మీకు 60 ఏళ్లు వస్తాయి. ఈ వయస్సు నుంచి పెన్షన్ పొందాలనుకుంటే ప్రతి సంవత్సరం రూ.1 లక్ష కంటే ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. అర్ధవార్షిక పెన్షన్ రూ.49911 లభిస్తుంది. అదేవిధంగా త్రైమాసిక పెన్షన్ రూ.24701 అలాగే నెలవారీ పెన్షన్ రూ.8149 పొందుతారు. ఈ పాలసీలో కనీస పెట్టుబడి రూ.1.50 లక్షలు కాగా గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదని గుర్తించండి.