LIC Pension Plan: ఒక్కసారి పాలసీ కడితే నెలకి రూ.20,000 వరకు పెన్షన్..!

LIC Pension Plan: ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ గురించి చింత ఉండదు.

Update: 2022-11-07 01:47 GMT

LIC Pension Plan: ఒక్కసారి పాలసీ కడితే నెలకి రూ.20,000 వరకు పెన్షన్..!

LIC Pension Plan: ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ గురించి చింత ఉండదు. రిటైర్మెంట్‌ తర్వాత హాయిగా జీవిస్తారు. కానీ ప్రైవేట్‌ ఉద్యోగులు, వ్యాపారులకి పెన్షన్ సౌకర్యం ఉండదు. రిటైర్మెంట్‌ తర్వాత వీరు ఎవరో ఒకరిపై ఆధారపడి బతకాల్సిందే. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త పెన్షన్ ప్లాన్‌లను విడుదల చేసింది. అలాగే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (LIC) కూడా ఒక పాలసీతో ముందుకు వచ్చింది. దీని కింద మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. తర్వాత జీవితాంతం పెన్షన్ అందిస్తారు. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జీవన్ అక్షయ్ ప్లాన్

ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టడం అనేది చాలామంది సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ. మీరు కూడా మంచి ఎల్‌ఐసి పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే జీవన్ అక్షయ్ ప్లాన్ గురించి తెలుసుకోండి. ఇందులో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. తర్వాత ప్రతి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ లభిస్తుంది.

ప్రతి నెలా రూ.20వేలు పింఛన్‌

పెట్టుబడిదారుడి వయస్సు 75 ఏళ్లు అయితే అతను ఏకమొత్తంలో రూ.610800 ప్రీమియం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై హామీ మొత్తం రూ.6 లక్షలు. వార్షిక పింఛను రూ.76650, అర్ధ వార్షిక పింఛను రూ.3735, త్రైమాసిక పింఛను రూ.18225 అందిస్తారు. మీకు నెలవారీ అయితే రూ.6008 పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ పాలసీదారుడు మరణించే వరకు అందిస్తారు. ఒకవేళ మీరు ప్రతి నెలా 20 వేల రూపాయల పెన్షన్ తీసుకోవాలంటే ఒకేసారి 40,72,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

పాలసీ ప్రయోజనాలు

ఈ ప్లాన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలసీని కొనుగోలు చేసిన మూడు నెలల తర్వాత రుణం తీసుకోవచ్చు. ఈ పాలసీలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు కానీ కనీసం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News