LIC Bhagya Lakshmi: ఎల్‌ఐసీలో అతి చిన్న పాలసీ.. తక్కువ మొత్తం ఎక్కువ రాబడి..!
LIC Bhagya Lakshmi: నేటికీ దేశంలో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు.
LIC Bhagya Lakshmi: నేటికీ దేశంలో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ధనవంతులు మాత్రమే పెట్టుబడి పని చేస్తారని నమ్మే కాలం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు చాలా పెట్టుబడి ఎంపికలు వచ్చాయి. తద్వారా మధ్యతరగతి, బలహీనమైన ఆర్థిక తరగతి ప్రజలు కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఈ రోజు పేదవర్గాలకి సంబంధించిన ఒక ఎల్‌ఐసి పాలసీ గురించి తెలుసుకుందాం.
ఈ ప్లాన్ LIC భాగ్యలక్ష్మి ప్లాన్. ఈ పథకం తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం మాత్రమే రూపొందించారు. ఈ పథకంలో మీరు మెచ్యూరిటీపై నిర్ణీత హామీ మొత్తాన్ని పొందుతారు. దీంతోపాటు మొత్తంపై ఎటువంటి పన్ను విధించరు. కాబట్టి ఈ పాలసీ గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. ఈ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా బీమా చేసిన వ్యక్తి రిటర్న్ ప్రీమియంతో టర్మ్ ప్లాన్ ప్రయోజనాన్ని పొందుతాడు. దీని ప్రకారం పాలసీదారు మెచ్యూరిటీపై 110 హామీ మొత్తాన్ని పొందుతాడు. దీంతో పాటు స్వల్పకాలిక ప్రణాళిక ఉంటుంది.
LIC భాగ్యలక్ష్మి యోజన ప్రత్యేక లక్షణాలు
1. ఈ పాలసీని తీసుకోవడానికి మీ వయస్సు 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఈ పాలసీని కనిష్టంగా 5 సంవత్సరాలు, గరిష్టంగా 13 సంవత్సరాలు తీసుకోవచ్చు.
3. ఈ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత బీమా చేసిన వ్యక్తి కనీసం 20 వేల రూపాయలను సమ్ అష్యూర్డ్‌గా పొందుతాడు.
4. అదే సమయంలో గరిష్ట హామీ మొత్తం 50 వేల రూపాయలు ఉంటుంది.
5. ఈ పథకం కింద మీరు ప్రతి నెల, మూడు నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు.
6. మెచ్యూరిటీపై 110 శాతం సమ్ అష్యూర్డ్ అందుబాటులో ఉంటుంది.
7. ఒక వ్యక్తి పాలసీ తీసుకున్న సంవత్సరం తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి డెత్ బెనిఫిట్ లభిస్తుంది.
8. LIC భాగ్యలక్ష్మి పాలసీని సరెండర్ చేయవచ్చు
9. LIC భాగ్యలక్ష్మి ప్లాన్ తీసుకున్న తర్వాత మీకు నచ్చకపోతే మధ్యలో మీరు పాలసీని సరెండర్ చేయవచ్చు. ఈ పరిస్థితిలో డిపాజిట్ చేసిన డబ్బులో 90 శాతం వరకు తిరిగి వస్తుంది.