Government Schemes For Girls: బాలికల కోసం ఈ 2 గవర్నమెంట్ స్కీమ్‌లు బెస్ట్.. అధిక వడ్డీ మంచి లాభాలు..!
Government Schemes For Girls: బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథ కాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నా యి.
Government Schemes For Girls: బాలికల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పథ కాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నా యి. ఈ పథకాలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక వడ్డీ సమకూరడంతో పాటు నిర్ణీత కాలానికి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. వీటిపై సెక్షన్ 80 సి ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు బెస్ట్ స్కీంల గురించి తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది 2023 యూనియన్ బడ్జెట్ లో ప్రకటించిన చిన్న పొదుపు పథకం. ఈ స్కీం మార్చి 2025 వరకు అంటే రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల కాలవ్యవధికి మహిళలు లేదా బాలికల పేరిట రూ.2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పార్షియల్ విత్‌డ్రా ఎంపికతో 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్కీం స్వల్పకాలానికి మహిళ పేరిట పెట్టుబడి పెట్టే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (ఎఫ్‌డి) సరైన ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. దీనిని దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులలో తీసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆడపిల్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం. ఇందులో ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయాల్సి ఉంటుంది. బేటీ బచావో బేటీ పఢావో ప్రచారంలో భాగంగా 2015లో ఈ స్కీం ప్రారంభించారు. ఇది 8.2 శాతంవడ్డీ రేటును అందిస్తుంది. ఇది ఏటా యాడ్ అవుతూ ఉంటుంది. ఈ పథకంలో కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలు వార్షికంగా డిపాజిట్ చేయవచ్చు. కనీసం 15 సంవత్సరాలు చెల్లించాలి.