ఈ కంపెనీ గ్యాస్ వాడుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..!
LPG Gas: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. చాలామంది వివిధ రకాల కంపెనీల గ్యాస్ సిలిండర్లని వాడుతుంటారు.
LPG Gas: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. చాలామంది వివిధ రకాల కంపెనీల గ్యాస్ సిలిండర్లని వాడుతుంటారు. అందులో ఇండెన్ గ్యాస్ కనెక్షన్ ఒకటి. మీరు కూడా ఇండెన్ గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లయితే ఈ విషయం తెలుసుకోండి. గ్యాస్ అకస్మాత్తుగా అయిపోయినప్పుడు ఇంట్లో కూర్చొని సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఫోన్ ద్వారా సులువుగా గ్యాస్ బుక్ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
వాస్తవానికి మీ దగ్గర రిజిస్ట్రర్ మొబైల్ ఉంటే అనేక విధాలుగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. కేవలం ఒక్క ఫోన్ కాల్ చేయడం ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7718955555 నంబర్‌కు కాల్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. కంపెనీకి సంబంధించి ఈ సదుపాయం 24 గంటలు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు యాప్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు.
మీరు ప్లే స్టోర్ నుంచి ఇండేన్ ఆయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసి యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత మాత్రమే మీరు సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే సబ్సిడీ డబ్బు అందకపోతే మీరు టోల్ ఫ్రీ నంబర్ 18002333555కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.