వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ చేసేటప్పుడు ఈ విషయాలు గమనించండి.. లేదంటే భారీగా నష్టపోతారు..!

Motor Insurance: మీకు సరైన మోటార్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రమాదం జరిగినప్పుడు అది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.

Update: 2023-03-05 13:30 GMT

వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ చేసేటప్పుడు ఈ విషయాలు గమనించండి.. లేదంటే భారీగా నష్టపోతారు..!

Motor Insurance: మీకు సరైన మోటార్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రమాదం జరిగినప్పుడు అది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. ఇన్సూరెన్స్‌ వాహనానికి జరిగిన నష్టాన్ని మాత్రమే కాకుండా డ్రైవర్‌కు మరొకరికి కలిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది. ఈ కారణంగా వాహనాలకు ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు లేదా వాటిని రెన్యూవల్‌ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

వాహన ప్రమాదాల విషయంలో భారతదేశం అత్యంత దారుణమైన దేశాలలో ఒకటి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. భారతదేశంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కావడానికి ఇదే కారణం. ఏది ఏమైనప్పటికీ థర్డ్ పార్టీ మోటర్ ఇన్సూరెన్స్‌కు బదులుగా సమగ్రమైన కవర్ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే చాలా బెటర్‌. ఎందుకంటే ఇది మెరుగైన రక్షణను అందిస్తుంది.

ప్రమాదం జరిగినప్పుడు లేదా వాహనానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు బీమా చేసిన వ్యక్తికి, థర్డ్‌ పార్టీకి సంబంధించిన వ్యక్తికి సమగ్ర బీమా వర్తిస్తుంది. దీంతో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్, 24 గంటల రోడ్ అసిస్టెంట్, థెఫ్ట్ ప్రొటెక్షన్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో థర్డ్ పార్టీ బాధ్యతలు మాత్రమే కవర్ అవుతాయని గుర్తుంచుకోండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..?

1. ఇన్సూరెన్స్‌ తీసుకునేముందు ఇతర ప్లాన్‌లతో సరిపోల్చండి. మీ అవసరానికి అనుగుణంగా ఫీచర్లు, ప్రయోజనాలు ఉండే పాలసీని ఎంచుకోండి.

2. ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేసే విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. క్లెయిమ్ తిరస్కరణకు ఇది అతిపెద్ద కారణం.

3. ప్రమాదం జరిగిన తర్వాత క్లెయిమ్ చేయడంలో ఆలస్యం చేయవద్దు. మీరు క్లెయిమ్ చేయడంలో ఎంత ఎక్కువ ఆలస్యం చేస్తే తిరస్కరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

4. ఎప్పుడూ తప్పుడు వాదనలు చేయవద్దు. మీరు క్లెయిమ్ చేసేటప్పుడు నిజాయితీగా ఉండి పారదర్శకతతో పని చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

5. ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసేటప్పుడు సంబంధిత కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి ఎంత ఉందో తనిఖీ చేయండి.

Tags:    

Similar News